Is money making easy?

డబ్బు సంపాదించడం ఇంత సులభమా?

ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్క వ్యక్తీ ఏదో ఒక సమస్యతో బాధ పడుతూ ఉంటాడు. ఏ సమస్యా లేని వ్యక్తీ బహుశా ఎక్కడా పుట్టి ఉండలేదనుకుంటా. ఆఖరికి లెక్కలేనంత సంపద కలిగి ఉన్న అంబానీ, బిల్ గేట్స్ లకి కూడా వారి స్థాయిలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇక సామాన్యుల విషయానికొస్తే కొందరికి ఆర్ధిక ఇబ్బందులు, కొందరికి ఆరోగ్య సమస్యలు, కొందరికి కుటుంబ, relationship సమస్యలు, మరికొందరికి కెరీర్, చదువులకి సంబంధించిన problems. ఇలా చెప్పుకుంటూ పొతే, ఒక సమస్యను పరిష్కరించి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నామో లేదో తక్కుమని మరో సమస్య రెడీగా ఉంటుంది.

ఇలా అన్నిరకాల సమస్యల్లో ఎక్కువమంది ఇబ్బంది పడేది ఆర్ధిక సమస్యలే. ఇదే అతి ముఖ్యమైనది. ఎందుకంటే చేతిలో డబ్బు ఉంటే మిగతా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. లేదా కనీసం solve చేయగలనన్న ఆత్మవిశ్వాసం అయినా ఉంటుంది.

కూటి కోసం కోటి విద్యలు’ అని మనమందరమూ ఇదివరకే చాలాసార్లు వినే ఉంటాము. అంటే మనం చేసే ప్రతీ పనీ కూడా డబ్బు సంపాదించడానికే (దాని ద్వారా ఆకలి తీర్చుకోడానికి). కొంతమంది తమకోరకే కాకుండా రాబోయే తరాలవారి కోసం కూడా సంపాదిస్తుంటారు అది వేరే విషయం.

మరి ఇంత ముఖ్యమైన డబ్బుని సంపాదించడం ఎలా?

చిన్నప్పటి నుండి స్కూలుకి వెళ్లి , ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించడం ద్వారానా?

పోనీ అలా ఉద్యోగం సంపాదించిన వాళ్ళేమైనా సుఖంగా ఉన్నారా?

కాస్త ఎక్కువసేపు నిద్ర పోవాలనిపిస్తున్నా, బలవంతంగా లేచి చకచకా రెడీ అయ్యి గంటకి పైగా ప్రయాణం చేసి వెళ్లి, బాస్ చెప్పే అడ్డమైన పనులు ఇష్టం లేకపోయినా చేస్తూ, ‘ఛీ …పోయిన జన్మలో ఎంతో పెద్ద పాపం చేస్తే తప్ప వీడి వద్ద పనిచేసే అగత్యం పట్టదు’ అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ, ఊసురోమంటూ రాత్రి ఏ టైం కో ఇంటికి చేరుకునేవాళ్ళు ఎంతోమంది.

ఎప్పుడో వచ్చే weekend కోసం సోమవారం నుండి మళ్ళీ ఎదురుచూపులు.

అలా కాకుండా మీకు ఆఫీసుకి వెళ్ళడం ఇష్టంలేని రోజున హాయిగా ఇంట్లోనే ఉండిపోతే ఎంత బాగుంటుంది. మీరు నిద్రపోయి లేచేసరికి మీ అకౌంట్లో ఓ వేయి రూపాయలు డిపాజిట్ అయ్యాయని పొద్దున్నే మొబైల్ లో మెసేజ్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది…కదూ…

పని చేసిన కాలానికి ఆదాయం పొందడం అందరికి తెలిసిందే. ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే వారందరూ ఇలాగే ప్రతీనెలా మొదటి తారీఖున salary తీసుకుంటారు. కానీ అలాకాకుండా పని చేయడం ఆపేసిన తరువాత కూడా ప్రతిఫలం పొందుతూంటే ఎంత బాగుంటుంది. ఆ ఆలోచనే గమ్మత్తుగా ఉంది కదూ…..

ఇలా నిజంగా సాధ్యమవుతుందా?

 అవును , ముమ్మాటికీ సాధ్యమే.

ఇప్పటికే ఈ ఆర్టికల్ చదువుతున్న చాలామందికి నేను ఏదో స్కీమ్ గురించో, పిరమిడ్, పొంజి …మీరు ఏ పేరుతోనైనా పిలవండి ..అలాంటి దాని గురించి చెబుతున్నానన్న అనుమానం వచ్చే ఉంటుంది.

కానీ అలాంటి get rich quick స్కీముల గురించి చెప్పాలన్న ఉద్దేశ్యం నాకేమాత్రం లేదు.

నేను చెప్పబోతున్నది ఒక నిజమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి అనే పద్ధతి. ( Building a business).

ముందుగా మీకు ఓ గమ్మత్తైన ఉదాహరణ చెప్పబోతున్నాను.

ప్రతీరోజూ వేయి రూపాయలు సంపాదించాలనేది మీ టార్గెట్ అనుకుందాం. ఇది ఎలా సాధ్యమవుతుంది?

మీరొక ఉద్యోగం సంపాదించుకొని కనీసం నెలకు 30 వేల salary పొందుతూ ఉంటే అప్పుడు మీరనుకొన్నది నెరవేరుతుంది. అలాకాక మరొక సన్నివేశాన్ని  ఊహించుకోండి.

వేయిమంది మీకు ప్రతీరోజూ ఒక రూపాయి చెల్లించారనుకుందాం, అప్పుడు కూడా మీరు రోజూ వేయి రూపాయలు పొందినట్లే కదా! వారు మీకెందుకు చెల్లిస్తారనేదాని గురించి తరువాత మాట్లాడుకుందాం, కానీ టెక్నికల్ గా ఇది సాధ్యమే కదా …

Audience సంఖ్య వాళ్ళు చెల్లించేది మీరు ప్రతీరోజూ పొందే మొత్తం
1000 1/- 1000
100 10/- 1000
10 100/- 1000

 

ఈ లెక్క ప్రకారం పదివేల మంది మీకు రోజూ పది పైసలు చెల్లించినా మీకు వేయి రూపాయలు వస్తాయని మీకు అర్థమయి ఉండవచ్చు. ఇప్పుడు ఈ చిన్న సరళమైన concept (భావన) మీకు అర్థమయితే మనం ఇంకా ముందుకు వెళ్ళవచ్చు.

ఇక తరువాత ప్రశ్న “వాళ్ళు మనకెందుకు డబ్బు చెల్లిస్తారు”?

పూర్తి ఆర్టికల్ ని ఈ క్రింది లింకు నుండి ఉచితంగా download చేసుకోండి.

http://imojo.in/dtzd20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *