మీ website కి ట్రాఫిక్ ని పొందడం ఎలా?-I

How to get traffic to your site(in Telugu)?

ఇంటర్నెట్ మార్కెటర్స్ ఎదుర్కునే ఓ అతిపెద్ద సమస్య ట్రాఫిక్.

నిజమే మీరు మీ సృజనాత్మకతని, మీ skillsని ఉపయోగించి ఎంత గొప్ప కంటెంట్ తో, ఎంత మంచి డిజైన్ తోనైనా అద్బుతమైన క్వాలిటీ గల websiteని రూపొందించినా కూడా తగినంత ట్రాఫిక్ (visitors) లేకపోతే మీ కష్టమంతా వృధా అయినట్లుగా అనిపిస్తుంది కదా..ఫ్రస్ట్రేషన్ ఒకేసారి మిమ్మల్ని ముంచెత్తిన ఫీలింగ్ కలుగుతుంది.

web ప్రపంచంలో ట్రాఫిక్ అనేది ఆక్సిజన్ లాంటిది. అది బ్లాగ్ అయినా, youtube ఛానల్ అయినా లేక podcast అయినా….

ఆక్సిజన్ లేకపోతే శరీరంలోని కణాలేవిధంగా జీవాన్ని కోల్పోతాయో అలాగే ట్రాఫిక్ లేని సైట్ కూడా ప్రాణంలేని దేహంలాగానే భావింపబడుతుంది.

అయితే చాలామంది ఇంటర్నెట్ మార్కెటర్స్ కి ఒక అపోహ ఉంటుంది. అదేమిటంటే

“If you build it, they will come.”

అంటే నాణ్యమైన కంటెంట్ ఎక్కడ ఉన్నా కూడా రీడర్స్ దానిని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు అని.

రీడర్స్ కి ప్రయోజనాన్ని చేకూర్చే, మంచి నాణ్యమైన websiteని ఒకదాన్ని మీరు రూపొందిస్తారు. Publish బటన్ నొక్కగానే  మీ సైట్ కి visitors వెల్లువగా రావడం మొదలవుతుందని మీరు నమ్ముతారు. ఇది వినడానికి బాగా ఉన్నాకూడా వాస్తవానికి సత్యం కాదు. మీరు ఎంత గొప్ప సైట్ ని రన్ చేస్తున్నా కూడా ఆ విషయం ఆడియన్స్ కి తెలీకుండా, మీ సైట్ అడ్రస్ తెలియకుండా వారు మీ కంటెంట్ ని చేరుకోవడం ముమ్మాటికీ సాధ్యం కాదు.  అందువల్ల website ని రూపొందించడం ఎంత ముఖ్యమో, దాని గురించి తగిన మార్కెటింగ్ చేయడం తద్వారా ట్రాఫిక్ ని పొందడం కూడా అంతే ముఖ్యం.

ఒక గొప్ప ఐడియా మీకు వచ్చినా కూడా దానిని పంచుకునేందుకు తగిన visitorలు గనక లేనట్లయితే ఆ ఐడియా విలువ సున్నా. కాబట్టి ఐడియా ఎంత ముఖ్యమో ట్రాఫిక్ కూడా అంతే ముఖ్యం.

గొప్ప ఐడియా+తక్కువ ట్రాఫిక్ < సాధారణ ఐడియా+ఎక్కువ ట్రాఫిక్

జనావాసంలేని దట్టమైన అడవిలో మీరొక భారీ సూపర్ మార్కెట్ ని ప్రారంభించారనుకుందాం. దాని గురించి ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు, కాబట్టి కస్టమర్లు వచ్చే chance లేదు. కస్టమర్లే లేరు కాబట్టి లాభాల గురించి ప్రసక్తే రాదు. ట్రాఫిక్ లేని ఓ ఐడియా కూడా ఇంచుమించు ఇలాంటిదే.

ఇప్పుడు ట్రాఫిక్ యొక్క విలువ మీకు అర్థమయ్యిందనుకుంటా. So, ఇప్పుడు మీ siteకి ట్రాఫిక్ ని రప్పించాలని బలంగా నిర్ణయించుకుని దానినే మీ ప్రధాన లక్ష్యంగా(Goal) పెట్టుకున్నారు.

 “A goal without a date is just a dream.”

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నప్పుడు ఆ గమ్యాన్ని చేరుకోడానికి ఓ గడువు తేదీ కూడా ముందుంచుకోవాలి. లేదంటే అది కేవలం ఓ కలగానే మిగిలిపోయే ప్రమాదముంది. ఇది లేకపోతే మీరు పరిగెత్తుతున్నారా, నడుస్తున్నారా, లేక ప్రాకుతున్నారా..అసలు ముందుకు కదులుతున్నారా లేక ఒకే చోట స్థిరంగా నిలబడి ఉన్నారా తెలుసుకోవడం కష్టం.  అందుకే ఫలానా రోజుల లోపల ఇంత ట్రాఫిక్ ను సాధించాలన్న goal ని ఏర్పరచుకోవడం మంచిది.

ఒకవేళ భారీస్థాయిలో లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా కూడా మీ సౌలభ్యం కోసం దానిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవాలి.

ఉదాహరణకి ఒక సంవత్సరంలోగా పది వేల subscribers కి చేరుకోవాలన్న మీ goal ని విడగొట్టుకోవడం మంచిది.

  • వారంలో ….
  • నెలలో
  • మూడు నెలల్లో
  • ఆరు నెలల్లో
  • సంవత్సరంలో

ఇలా విభజించుకోవడం ఎంతో మంచిది. అంతేగాక ఒక్కో చిన్న లక్ష్యాన్ని దాటుకుంటూ ముందుకి వెళ్తున్న కొద్దీ మీ ఆత్మవిశ్వాసం మరింత పెరగడంతోపాటు మీ లక్ష్యం మరింత స్పష్టంగా సమీపిస్తుండడం గమనించవచ్చు. ఒక్కో లక్ష్యాన్ని దాటుతున్న కొద్దీ దానిని celebrate చేసుకోవడం మరిచిపోవద్దు. ఇది మీకు boosting నిస్తుంది.

ట్రాఫిక్ ని కొలవడం:

మీరు లక్ష్యం వైపుగా పయనిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి ఓ టూల్ అవసరం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *