మీ website కి ట్రాఫిక్ ని పొందడం ఎలా?-III

How to get traffic to your site (in Telugu)?

ఒకవేళ SEO పరంగా సైట్ ని ఇంప్రూవ్ చేయాలని భావిస్తే ఈ క్రింది అంశాలపై దృష్టి సారించాలి.

  • మీ కంటెంట్ కి ట్రాఫిక్ ఏ లింకుల ద్వారా వస్తున్నది?
  • దీనిని ఏ విధంగా ఇంకా మెరుగుపరుచవచ్చు?
  • ఏవైతే సైట్లు మీ వెబ్ పేజీలకి ట్రాఫిక్ ని అందిస్తున్నాయో అవి మీ niche కి తగినవేనా ? (Relevent?)

 మీ సైట్ యొక్క niche కి ఏమాత్రం సంబంధం లేని సైట్ల నుండి వచ్చే ట్రాఫిక్ కి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది నిరర్థకమైనది (useless). ఉదాహరణకు మీరు మధుమేహ వ్యాధి (diabetes) గురించి ఓ బ్లాగ్ రన్ చేస్తున్నారు. దీనికి ఆయుర్వేదా, యోగ, ఔషధాలు, fitness లాంటి సైట్ల నుండి గనక లింక్స్ లభిస్తే అవి natural లింక్స్ గా పరిగణించబడతాయి. ఎందుకంటే ఈ nicheలు diabetes తో ఎంతోకొంత సంబంధాన్ని (Relevance) కలిగిఉన్నాయి. అలాకాక క్రికెట్ , స్టాక్ మార్కెట్ , movies సైట్ల నుండి గనక లింక్స్ లభిస్తే అవి irrelevant లింక్స్ గా భావిస్తారు. వీటికి పెద్దగా విలువ ఉండదు.

Engagement:

ప్రవేశించిన తరువాత ఒక visitor సగటున ఎంతసేపు మీ సైట్లో గడుపుతున్నాడు?

 దీనినే యూజర్ ఎంగేజ్ మెంట్ (Engagement) అంటాము. ఈ సమయం ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత క్వాలిటీ కలిగిన, ఉపయోగకరమైన కంటెంట్ ను అందిస్తున్నట్లుగా గూగుల్ భావిస్తుంది. దీనికి భిన్నంగా, వచ్చిన వెంటనే ఒక యూజర్ సైట్ నుండి బయటకు వెళ్ళిపోతే ఆ సైట్ వల్ల యూజర్లకి ఏ మాత్రం ప్రయోజనం లేనట్లుగా పరిగణిస్తుంది.

లింక్ క్వాలిటీ:

ఇంతకుముందే చెప్పినట్లు అన్ని లింకులూ ఒకే విలువను కలిగి ఉండవు. ఆయా సైట్ల విలువను బట్టి (authority) ఆ లింకుల విలువ మారుతూ ఉంటుంది. ఒక మంచి ర్యాంకున్న సైట్ నుంచి వచ్చే ఒకే ఒక్క లింకు వంద మామూలు సైట్ల నుండి వచ్చే లింకుల కన్నా ఎంతో విలువైనది. అందువల్ల విలువలేని ఇలాంటి సైట్లనుండి back links కన్నా కేవలం ఒకే ఒక్క లింకు కోసం ప్రయత్నించడం మంచిది. అయితే  authority సైట్ల నుండి back link సంపాదించడం అంత సులభమైన విషయమేమీ కాదు. దీనికి కష్టపడాల్సి ఉంటుంది. ఈ కష్టపడటమనేది మంచి కంటెంటుని అందించడంతోనే మొదలుపెట్టాలి. ఆ తరువాత మార్కెటింగ్ టెక్నిక్ లపై, networking లపై ఆధారపడవచ్చు.

ప్రముఖ దినపత్రికలు, మాగజైన్లు, ఎడ్యుకేషన్ సైట్ల ( .edu ) ను గూగుల్ సాధారణంగా authority సైట్లుగా గుర్తిస్తుంది.

యూజర్లు ఎలాంటి keywords ని ఉపయోగించి తమకు కావాల్సిన కంటెంట్ కొరకు సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోగలిగితే అవే keywords ని మీ ఆర్టికల్స్ లో ఉపయోగించి మరింత ఎక్కువ ట్రాఫిక్ ని సంపాదించవచ్చు. మరి ఈ యూజర్లు ఎలాంటి keywords ని ఉపయోగిస్తున్నారో తెలుసుకోడానికి ఎక్కువమంది ఉపయోగించే ఒక ఉచిత టూల్ Google Keyword Planner.

నిజానికి ఈ Google ఈ టూల్ ని ప్రకటనదారుల (advertisers) సౌలభ్యం కోసం రూపొందించబడింది. కాకపొతే ఒక site owner గా మనం కూడా ఈ టూల్ ని మనకనుగుణంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ టూల్  ఒక keywordనుపయోగించి సగటున నెలకి ఎంతమంది యూజర్లు సెర్చ్ చేస్తున్నారో (search Volume) తెలుపుతుంది. అంతేగాక ఒక్కో search wordకి గల కాంపిటీషన్ ని కూడా మనకు తెలియజేస్తుంది. నిజానికి ఈ కాంపిటీషన్ అనేది advertisements ఇచ్చేవారికి (ప్రకటనదారులకి) పనికొచ్చేటటువంటి ఓ కొలమానం. కాకపొతే మనం కూడా మనకనుకూలంగా ఉపయోగించుకోవచ్చు.

గమ్మత్తైన విషయమేమిటంటే, ఈ టూల్ ని ఉపయోగిస్తున్న కొద్దీ ‘యూజర్లు ఫలానా keywords కోసం కూడా సెర్చ్ చేస్తున్నారు’ అన్న సంగతి మనకు అర్థమయ్యి ఆ keywords ని కూడా కంటెంటులో పొందుపరచడానికి అవకాశముంది. మరికొందరైతే ఏకంగా ఇలాంటి కొన్ని keywords ని పట్టుకుని వాటి చుట్టూ ఓ micro niche site ని రూపొందించడం కూడా జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *