మీ website కి ట్రాఫిక్ ని పొందడం ఎలా?-II

How to get traffic to your site (in Telugu)?

ఇప్పుడీ పుస్తకంలో చెప్పిన విధానాలు, టెక్నిక్స్, టిప్స్ పని చేస్తున్నాయో లేదో తెలియాలంటే మీ సైట్ మొదట్లో ఉన్న ట్రాఫిక్ ని ఈ టెక్నిక్ లు అమలు పరచిన తరువాత వచ్చే ట్రాఫిక్ తో పోల్చి చూడాలి.  అప్పుడుగానీ ఈ టిప్స్ పనికి వస్తాయో లేవో తెలియవు. ఇలా పోల్చి చూడాలంటే పోల్చడానికి ఏదైనా ట్రాఫిక్ ని విశ్లేషించే టూల్ అవసరం. దీనికోసం మీరు wp Slimstat లేక Google Analytics టూల్ ని ఉపయోగించవచ్చు.

Search Engine Optimization:

 “మీ సైట్ కి లభించే organic trafficలో మూడొంతులకి పైగా Google నుండే లభిస్తుంది”

ఇతర అంశాల్లో బ్లాగర్ల మధ్య భిన్న అభిప్రాయాలు ఉండొచ్చునేమోగానీ అందరూ మాత్రం ముక్తకంఠంతో ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

మరో మంచి విషయమేమిటంటే Google నుండి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఉచితంగా లభించేదే. దీనికి ప్రత్యేకంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు.

తెలుగు సైట్లకి SEO:

google, Bing లాంటి సెర్చ్ ఇంజిన్ల నుండి వెబ్ సైట్లకి ట్రాఫిక్ లభిస్తుంది. ఈ  సెర్చ్ ఇంజిన్లలో సెర్చ్ చేసినపుడు Results లో కనిపించే వెబ్ సైట్లపై క్లిక్ చేసి యూజర్లు తమకి నచ్చిన సైట్లోకి ప్రవేశిస్తారు. ఈ సెర్చ్ ఇంజిన్ల ఫలితాలలో మంచి ర్యాంకు కోసం ఒక website ని తీర్చిదిద్దడాన్నే Search Engine Optimization అంటారు.

ఈ SEO అనేది search చేసేటపుడు యూజర్ ఉపయోగించే keywordsని ఆధారంగా చేసుకుని పని చేస్తుంది.

దీనితో వచ్చిన చిక్కేమిటంటే ఈ SEO కొరకు గూగుల్ ఉపయోగించే algorithom నిరంతరం మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది అనడం కంటే గూగుల్ మారుస్తూ ఉంటుంది అనడమే కరెక్ట్.

so, మీ సైట్ యొక్క SEO బాగా రావాలంటే మీరు కూడా తగిన keywords ని ఆర్టికల్స్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ keywords ని place చేయడం కృత్రిమంగా కాకుండా అవసరానికి తగ్గట్టుగానే ఉండాలి. మితిమీరిన keywords stuffing వల్ల కీడే తప్ప ఏమాత్రం మేలు జరగదు.

keywords విషయంలో కొంతమంది సీనియర్ బ్లాగర్లు ఇచ్చే సలహా ఏమిటంటే “keywords, SEO లాంటి క్లిష్టమైన విషయాల గురించి అనవసరంగా కంగారు పడకుండా కేవలం మీ ఆర్టికల్స్ యొక్క క్వాలిటీ పై మాత్రమే దృష్టి పెడుతూంటే యూజర్లు సహజంగా ఉపయోగించే keywords అందులో భాగంగానే ఆటోమేటిగ్గా పొందుపరచబడటం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా keywords ని వెతికి contentలో  ఇమడ్చాల్సిన అవసరం లేదు.”

గూగుల్ మీ సైట్ యొక్క విలువను అంచనా వేసి ఆ తరువాత సెర్చ్ ఇంజిన్ ర్యాంకులలో ఏ పేజీలో మీ సైట్ ను ప్రదర్శించాలో నిర్ణయిస్తుంది. ఈ మొత్తం process లో ముందుగా మీ సైట్ యొక్క విలువని అంచనా వేస్తుంది. ఇలా అంచనా వేయడానికి అనేక అంశాలపై ఆధారపడుతుంది. అందులో ముఖ్యమైనవి రెండు…..

  1. Back links  2. Engagement

బ్యాక్ లింక్స్:  

ఎప్పుడైతే మీరు పాఠకులకు ఉపయోగకరమైన కంటెంట్ ను అందించడం మొదలుపెడతారో అప్పుడు దాని విలువని గుర్తించిన ఆడియన్స్ సోషల్ మీడియాలో గానీ, తమ బ్లాగుల్లోగాని తమ స్నేహితులతో, viewersతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీ కంటెంటు యొక్క url లింకుని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వబడ్డ లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఎవరైనా మీ ఆర్టికల్ ని చేరుకోగలుగుతారు.  ఇలాంటి లింకులని back links అని అంటాము.

నాణ్యత లేని సైట్లకి లింకు ఇవ్వడానికి, share చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపడం జరగదు. కాబట్టి ఒక సైట్ కి back links ఎన్ని ఎక్కువగా ఉంటే అది అంత క్వాలిటీ ఉన్నట్లుగా భావించబడుతుంది.

అలాగే ఒక Nicheలో ఎక్కువగా పోటీ లేనపుడు (ఒక అంశంపై contentను అందించే website లు ఎక్కువగా లేనిపక్షంలో) మీరు సైట్ రూపొందించినపుడు, మీ కంటెంట్ కి back links లేకపోయినా కూడా మీకు మంచి ర్యాంకే లభించే అవకాశముంది (పోటీ లేదు కాబట్టి). కానీ ఏ keywords లో ర్యాంకు కోసం తీవ్రమైన పోటీ ఉందో ఆ సమయంలో back links ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పోటీ లేనపుడు ఒక కీవర్డ్ కి ర్యాంకు సంపాదించడం చాలా సులభం.

అయితే ఏ site నుండి మీకు back link ఇవ్వబడిందో ఆ site విలువని బట్టి కూడా ఆ back link యొక్క విలువ నిర్దారింపబడుతుంది. అంటే ఓ విలువైన authority site నుండి వచ్చే back link కి ఎక్కువ weightage,  కనీసం అయిదు ఆర్టికల్స్ కూడా లేని ఓ మామూలు site నుండి వచ్చే back link తక్కువ weightage ఇవ్వబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *