Marketingకి facebook fan page అవసరమా?

మార్కెటింగ్ ను ఆషామాషీగా కాకుండా సీరియస్ గా భావిస్తున్నట్లయితే మీకు సాధారణ facebook ప్రొఫైల్ పేజీ మాత్రమే కాకుండా facebook page కూడా కలిగిఉండడం అవసరం. ప్రొఫైల్ పేజీ కంటే fan page అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

  • ఒక వ్యక్తీ ఒక fan page ని like చేసినపుడు ఈ విషయం అతని facebook సర్కిల్ లోని అందరికీ తెలిసిపోతుంది. ఆసక్తి ఉన్నవారు ఆ page ఏమిటోనన్న కుతూహలంతో ఆ pageని సందర్శించి నచ్చితే వారు కూడా like చేసి follow అవ్వడం జరుగుతుంది.
  • ప్రొఫైల్ పేజీలో ఓ వ్యక్తికీ 5000 కన్నా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడానికి వీలు లేదు. మీ ఫ్రెండ్స్ సంఖ్యా గనక 5000కి చేరినట్లయితే ఇకపై మీరు మరో వ్యక్తిని ఫ్రెండ్ గా స్వీకరించే అవకాశం లేదు. అదే fan pageలో ఈ సంఖ్య పై ఎలాంటి పరిమితీ లేదు. మీ టాలెంటుని బట్టి కొన్ని లక్షల మంది కూడా మిమ్మల్ని follow కావొచ్చు.
  • మీ లేటెస్ట్ బ్లాగ్ పోస్టులు, మీ products, ఈవెంట్స్, ఆఫర్స్, updates, ఇతర information ఏదైనా ఒకే ఒక క్లికులో మీ పేజీని follow అవుతున్నవారికి చేరుకునేలా చేయవచ్చు.
  • ఈ fan page మీరు మీ followerలతో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం కల్పిస్తుంది. మీ productsని కొనుగోలు చేసినవారు గానీ, కొనుగోలు చేయాలనుకున్నవారు గానీ తమ సందేహాలు తీర్చుకోవడానికి ఓ మంచి వేదికగా ఈ fan page ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రశ్న సమాధానాల ద్వారా మీ విశ్వసనీయత పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని నమ్మడం మొదలుపెడతారు. నెమ్మదిగా మీకంటూ ఓ brand గా గుర్తింపు రావడం జరుగుతుంది. స్థిరమైన, పది కాలాల పాటు ఉండే business చేయాలనుకునేవారు ఇలా తమ ఆడియన్స్ తో మంచి సంబంధాలు (relationship) ఏర్పరచుకోవడం చాలా అవసరం.

ఓ ప్రోడక్ట్ ని కొనాలని అనుకున్న తరువాత కస్టమర్ ముందుగా దాని గురించి ఎంక్వయిరీ చేస్తాడు.

  • ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా ? ఉపయోగకరమైనదేనా?
  • తను ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించగలిగేదేనా?
  • ప్రోడక్ట్ వినియోగంలో ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశముందా?
  • ఒకవేళ అలాంటి ఇబ్బందులేమైనా వస్తే కంపెనీ నుండి support లభిస్తుందా?
  • ఇంతకుముందు ఆ ప్రోడక్ట్ ను ఉపయోగించినవారి అనుభవాలేమిటి?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు పొందేందుకు చేసే ఎంక్వయిరీలో ఆ ప్రోడక్ట్ యొక్క fan page ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఉచితం: facebook fan page యొక్క గొప్ప feature ఏమిటంటే దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.

Likes:

Thumsup Adలో మాదిరి కనిపించే బొటనవేలి గుర్తును చూడగానే టక్కుమని facebook గుర్తుకు వస్తుంది. ఏదైనా ఓ pageని చూడగానే ఈ thumb పక్కనే ఉన్న నెంబర్ ని (సంఖ్య) చూడగానే ఆ page యొక్క పాపులారిటీని ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. అంతమంది యూజర్లు ఈ పేజిని ఇష్టపడ్డారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పేజీ like అనేది పోస్టు like కంటే భిన్నమైనది.

ఒక పోస్టుకి వచ్చిన Likes ని బట్టి కూడా ఆ పోస్టు జనాదరణ పొందిందో లేదో చెప్పవచ్చు. ఆడియన్స్ ఎలాంటి పోస్టులు కోరుకుంటున్నారో గుర్తించడానికి కూడా likes సంఖ్య దోహదపడుతుంది. మీ Ad campaign విజయవంతమయ్యిందో లేదో గుర్తించే ఒక టూల్ ఈ likes సంఖ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *