Facebook marketing secrets in Telugu-1

Facebook marketing secrets in Telugu-1

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్క మార్కెటర్ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా మాధ్యమం facebook.

మార్కెటింగ్ కోసం ఎన్నో ప్లాట్ ఫార్మ్స్ ఉండగా facebook నే ఎందుకు ఎంచుకోవాలి? ఏంటీ దాని గొప్ప? అనే సందేహం మీకు కలిగి ఉండవచ్చు

Facebook అనేది సరదాకి, కాలక్షేపానికి కుర్రాళ్ళు వాడుకునే ఓ సైట్ స్థాయి నుండి visitors hits ల సంఖ్య విషయంలో google ని సైతం తోసిరాజని ఉన్నత స్థానానికి చేరుకుంది. కంప్యూటర్, ఇంటర్నెట్ ల గురించి తెలిసి ఉన్న ప్రతీవ్యక్తి తనకంటూ ఒక facebook ఎకౌంటును కలిగిఉంటున్నాడు. facebook ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నదే తప్ప ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా facebook అనేది మార్కెటింగ్ లో ఓ కీలకమైన tool అనేది కాదనలేని సత్యం.

Facebook is viral:

మీరొక స్టొరీ చదువుతారు. మీకది చాలా నచ్చుతుంది. వెంటనే మీ timelineపై దానిని షేర్ చేస్తారు. అది మిమ్మల్ని follow అవుతున్నవారికి, మీ సన్నిహితులందరికీ చేరుతుంది. వారికీ నచ్చితే వారూ షేర్ చేయడం మొదలెడతారు. క్రమంగా అది వైరల్ అవుతుంది. మీకు ఏమాత్రం పరిచయం లేనివారికి కూడా చేరవేయబడుతుంది. అదే facebook లాంటి సోషల్ networking సైట్ల ప్రత్యేకత.

అంతేగాక ఇక్కడ cross platform షేరింగ్ కూడా జరుగుతుంది. మీరు ట్విట్టర్లో ఒక ట్వీట్ చూస్తారు. మీకది బాగా నచ్చితే retweet చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీకు ట్విట్టర్లో కంటే facebook లోనే ఎక్కువ మంది సన్నిహితులున్నారనుకుందాం. అపుడు ట్విట్టర్లోని tweetని facebook లో కూడా షేర్ చేస్తారు. ఇలా షేర్ చేయడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక క్లిక్కు చాలు.

గ్లోబల్ గా వ్యాప్తి:

సరైన పద్దతిలో ఉపయోగించుకోగలిగితే facebookలో మీ పోస్టులను ప్రపంచంలోని నలుమూలల audience చూడగలుగుతారు.

టార్గెటెడ్ ట్రాఫిక్:

facebook లోని మరో ప్రత్యేకత ఇది. మీరు ఎంచుకున్న రంగానికి  చెందిన audience ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఫోటోషాప్ లోని టెక్నిక్స్ ని వివరిస్తూ ఓ ebook ప్రచురించారనుకుందాం. ఆ పుస్తకం యొక్క అమ్మకాలు పెరగాలంటే “ఫోటోషాప్ పై ఆసక్తి” ఉన్న వారివద్దకే మీ పుస్తకాన్ని తీసుకెళ్ళాలి తప్ప క్రికెట్ ఆట పై ఆసక్తి ఉన్నవారి వద్దకి కాదు. facebook లో ఇలా ప్రత్యేకంగా ఒక అంశంపై ఆసక్తి గలవారి వద్దకి మీ పోస్టులని చేర్చడం చాలా సులభం. ఇలా టార్గెటెడ్ ట్రాఫిక్ ఉన్నపుడు మీ Ad campaignలు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

అలాగే మీ productలను ఇష్టపడుతున్న పాఠకుల యొక్క demographic సమాచారం గనక మీ దగ్గర ఉన్నట్లయితే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో మీకు స్పష్టంగా తెలుస్తుంది. దాని ద్వారా పాఠకులు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని వారికి తగిన productsని అందించే అవకాశముంది.

websiteకి ట్రాఫిక్ ని రప్పించడం:

అనేకమంది online marketers, తమ websiteకి ప్రేక్షకులను ఆకర్షించడానికి facebook ని ఉపయోగిస్తున్నారు. తమ site ని సందర్శించిన ప్రేక్షకులకి తగిన productsని, సేవలను అందించి దానిద్వారా తాము కూడా ఆదాయం పొందే ప్రయత్నం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *