facebook fan page రహస్యాలు-2

Facebook fan page secrets in Telugu.

మీ facebook pageలో ఏమి పోస్టు చేయాలి?

blogging, online marketingలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం “Content is king”. visitorలకి కావాల్సిన కంటెంటుని అందిస్తూ ఉంటే మీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. దీనిని మించిన సక్సెస్ సూత్రం ఏదీ లేదు. కేవలం కొన్ని ఆర్టికల్ రాసి హాయిగా కూర్చుంటే సరిపోదు. నిరంతరం కొత్త కంటెంటుని అందిస్తూనే ఉండాలి. అప్పుడే మీరు మీ నిచేలో నెంబర్ 1 గా భావింపబడుతారు.

ఈ కంటెంట్ ఎలా ఉండాలి?

 • ఆసక్తికరంగా ఉండాలి. చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలనిపించేలా, నెక్స్ట్ ఆర్టికల్ ఎప్పుడు publish అవుతుందా అని ఎదురుచూసేలా ఉండాలి.
 • టైటిల్ ఆకట్టుకునేలా ఉండాలి. టైటిల్ చూసి పక్కన పడేయకుండా మొత్తం ఆర్టికల్ ని చదవడానికి ప్రోత్సహించేలా ఉండాలి.

మీరొక పుస్తక ప్రదర్శనకి వెళ్ళారనుకుందాం. అక్కడ ఓ పుస్తకాన్ని చూసారు. దాని కవర్ పేజీ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. పుస్తకాన్ని తెరిచి ఇండెక్స్, లోపలి పేజీలు ఓసారి తిప్పి చూసారు. కంటెంట్ మీకు ఉపయోగపడేలాగానే ఉంది. అక్కడే నిల్చుని మొత్తం పుస్తకాన్ని చదవలేరు కదా…ఆ రెండు నిముషాల వ్యవధిలోనే పుస్తకాన్ని కొనాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకోవాలి, అంతేనా!

ఓ పుస్తకాన్ని కొనాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించేవి రెండే అంశాలన్నమాట.

 1. కవర్ పేజీ
 2. ఇండెక్స్

ఇందులో కవర్ పేజీ గనక బాగాలేకపోతే పాఠకుడు కనీసం పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని చూడటం కూడా జరగదు. కాబట్టి మొదటి ప్రాధాన్యత కవర్ పేజీకే. అయితే ఇదంతా సంప్రదాయ (offline) మార్కెటింగ్ పద్దతి.

అదే online లో అయితే కవర్ పేజీ పాత్రను బ్లాగ్ పోస్టు image, site design, theme ఇవన్నీ కలిపి పోషిస్తాయి.

మీరు కష్టపడి సంపాదించిన ఒక్కో follower ను నిరంతరం కొత్త updates తో ఎంగేజ్ చేస్తూ, వారు మీ పేజీ నుండి unsubscribe చేయకుండా కాపాడుకుంటూ, వారి ద్వారా మరింతమంది కొత్త followerలను సంపాదించడమే అసలైన online marketing వ్యూహం. వారిలో కొంతమంది unsubscribe చేస్తూ వెళ్ళినా  సైటులో యూజర్ engagement తగ్గుతున్నదన్నమాటే. ఈ సమయంలోనే మీరు జాగ్రత్త పడి మరింత ప్రయోజనకరమైన కంటెంటుని అందించాల్సి ఉంటుంది.

మీ facebook fan page ప్రధాన ఉద్దేశ్యమేమిటి ? మీ products యొక్క మార్కెటింగే కదా! మీరేవైతే products ని అమ్ముతున్నారో వాటి గురించి సమాచారాన్ని, ఉపయోగాలను ఆడియన్స్ కి తెలపడమే కదా. మార్కెటింగ్ లోని ఒక గొప్ప రహస్యమేమిటంటే మీ ప్రోడక్ట్ వల్ల కస్టమర్ కి కలిగే లాభాలను సరిగ్గా వివరించ గలిగితే అవసరమున్న వినియోగదారుడు ఆటోమాటిగ్గా ఆ ప్రోడక్ట్ ని కొనుగోలు చేస్తాడు. అలా కొనుగోలు చేయలేదంటే

1.ఆ వ్యక్తికీ ఆ ప్రోడక్ట్ తో పని లేదన్న మాట

లేదా

2.మీరు చెప్పేది వారికి సరిగ్గా అర్థం కాలేదన్నమాట (వారికి అర్థమయ్యేలా మీరు చెప్పలేక పోయారన్నమాట)

అందుకే సరైన మార్కెటింగ్ వ్యూహాలు డిస్కౌంట్లు, తగ్గింపు ధరలు లాంటి వాటిపై కాకుండా ఆ ప్రోడక్ట్ వల్ల కలిగే లాభాల గురించి మాత్రమే ప్రచారం చేస్తాయి. కొన్నిసార్లు ఒకే ప్రోడక్ట్ ని అనేక మంది సెల్లర్లు అమ్మడానికి ప్రయత్నించినపుడు మాత్రమే డిస్కౌంట్లు, Buy One get One free లాంటి offers, After sales service లాంటివి ముఖ్యపాత్ర పోషిస్తాయి.

facebook marketing secrets in Telugu
facebook marketing secrets in Telugu

మీరొక deep fry pan ని అమ్ముతున్నారనుకుందాం. మీ సేల్స్ పెంచుకోడానికి ఒక fan page ని కూడా create చేసుకున్నారు. మీ సొంతంగానో లేక ఒక ప్రొఫెషనల్ సాయంతోనో ఓ fan page ఏర్పాటు చేసుకున్నారు. ఆ పేజీ design, appearance అంతా మీకు నచ్చింది. అంతా ఒకే అనుకున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన చిక్కల్లా…

 • ఎలాంటి కంటెంట్ రాయాలి?
 • నిరంతరం ఎలా update చేస్తూ ఉండాలి?
 • యూజర్లను ఎలా ఎంగేజ్ చేయాలి?
 • మరింతమంది visitorలను ఎలా మీ పేజీకి రప్పించాలి?
 • ఇలా వచ్చిన వారికి మీ products గురించి ఎలా చెప్పాలి?

ఓ visitor పేజీలోకి రాగానే “మా products ఇవీ …..” అంటూ మొదలెడితే ఆ సేల్స్ పిచ్ కి దడుసుకొని వచ్చినవారు వచ్చినట్లే, వెనక్కితిరిగి చూడకుండా పరుగు పెడతారు. అందుకే visitorలకి ఏదైనా కొత్త విషయం గురించి గానీ, ఏదైనా ప్రయోజనం చేకూర్చే అంశాల గురించిగానీ చెప్పవచ్చు. ఉదాహరణకి…

 • Deep fry pan ని ఉపయోగించి చేయదగ్గ కొన్ని వంటలు ( ఓ సిరీస్ లాగా)
 • వంట చేసేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 • వంట గ్యాస్ ని ఎలా ఆదా చేయవచ్చు?
 • Deep fry pan ని ఉపయోగించి వంటలు చేసేటపుడు refined oilని ఎలా ఆదా చేయాలి?
 • సింపుల్ గా ఒక poll ని నిర్వహించవచ్చు కూడా.
 • కొన్ని వీడియోలు.
 • ఒక మంచి చెఫ్ తో ఓ చిన్న ఇంటర్వ్యూ. (గృహిణిలతో కూడా)
 • మీ నిచేలో, టెక్నాలజీలో వస్తున్న మార్పులు (ఉదాహరణకి టేఫ్లాన్ అంతే ఏమిటి? దాని వల్ల ఉపయోగాలు..)

ఇల్లా ఆలోచిస్తూ వెళ్తుంటే మరిన్ని మంచి ఐడియాలు ఎన్నో వస్తుంటాయి. అయితే ఇక్కడ ఓ Deep fry pan గురించే చర్చించాము. మీ niche ఏదైనా, దానికి తగ్గట్టుగా ఎలాంటి పోస్టులు రాయగలుగుతాము అని ముందే ఆలోచించి ఓ లిస్టులాగా  రాసుకొని దాని ప్రకారం పోస్టు చేస్తూ వెళ్ళవచ్చు.

మధ్య మధ్యలో అప్పుడప్పుడూ మీ products (Deep fry pan) గురించి చెప్పవచ్చు. అప్పుడది పెద్దగా సేల్స్ పిచ్ లాగా అనిపించదు కూడా.

ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా ఏం చేసినా సరే….

మంచి ఆకట్టుకునే టైటిల్ తో fan pageలో పోస్టు ఉంచి అక్కడి నుండి మీ website కి లింకు ఇవ్వవచ్చు. దీని ద్వారా facebook ద్వారా వచ్చిన యూజర్ని మీ site కి రప్పించవచ్చు. ఓసారి siteని సందర్శించిన యూజర్ని మీ కంటెంటు ద్వారా ఆకట్టుకుని subscribe చేసేలాచేసుకుంటే మీరు విజయం సాధించినట్లే. దీనికోసం టైటిల్ తో పాటు మంచి image ను కూడా ఉపయోగించవచ్చు.

వీలయినంత మటుకు innovativeగా (వినూత్నంగా) కంటెంటు రాసే ప్రయత్నం చేయండి. ఏళ్ళ తరబడి మనం చూస్తున్న బోరింగ్ పద్ధతులకి bye చెప్పండి. Formalగా కంటే informal గా రాయడమే కొన్నిసార్లు యూజర్లని ఆకట్టుకుంటుంది. పోస్టుల్లో హాస్యాన్ని జోడించగలిగితే మీకిక తిరుగే లేదు. ఇది సోషల్ మీడియా……మీకు ఎలా అనిపిస్తే అలా రాయొచ్చు. ఒకసారి రాసిన తరువాత తిరిగి చూసుకుని ఎడిట్ చేసుకుంటే సరి.

Call to Action తప్పనిసరి.

ప్రశ్నలు అడగండి. మీ యూజర్లని తగిన ప్రశ్నలు అడగడం ద్వారా వారిని ఎంగేజ్ చేయవచ్చు. ఇది ఇంటరాక్షన్ కి దారి తీసి ఒక మంచి కమ్యూనిటీ రూపొందే అవకాశముంది. పైన చెప్పిన ఉదాహరణనే తీసుకుంటే వారికి నచ్చిన ఒక recipe పేరు తెలపమని అడగవచ్చు. లేదా ఫలానా సందర్భంలో (పండగ, సెలబ్రేషన్..etc) వారు ఇష్టపడే వంటకమేమిటో అడగవచ్చు.

కేవలం fan pageలోని followersకే పరిమితమైన exclusive offerలను ప్రకటించవచ్చు. దీనికోసం coupon code లాంటివాటిని ఉపయోగించవచ్చు. ఎవ్వరికీ లభించని offer తమకు మాత్రమే లభిస్తే అది నిజంగానే సంతోషించే విషయమే కదా. కొన్నిసార్లు మీ నిచేలోని ఇతరులు కూడా తమ ప్రోడక్ట్ లపై offer లను ప్రకటిస్తూ ఉంటారు. వీలయితే ఇలాంటివి కూడా మీ fan పేజీలో పోస్ట్ చేయవచ్చు. చాలామంది ఈ పని చేయడానికి వెనుకాడతారు. ఇతరుల ప్రోడక్ట్ లను నేను మార్కెట్ చేయడమేమిటి (అదీ నాకెలాంటి లాభం లేనపుడు)? అన్న రీతిలో ఆలోచిస్తారు. అయితే ఇలాంటి పోస్టుల వల్ల యూజర్లలో మీపై సదభిప్రాయం ఏర్పడి ‘ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరు పని చేస్తున్నారు’ అన్న భావన ఏర్పడుతుంది. అలా చేయడానికి ఒకవేళ మీకు మనసొప్పక పొతే సింపుల్ గా అఫ్ఫిలిఅతె అవకాశాలున్న ప్రోడక్ట్ లను గుర్తించి వాటికి సంబంధించిన offerలను పోస్టు చేయవచ్చు. దీనివల్ల స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరినట్లు, మీ యోజ్జర్లు జరిపే కొనుగోళ్లలో మీకు కొంత వాటా (commission) కూడా దక్కుతుంది.

చేసే ప్రతీ పనిలో లాభాన్ని ఆశించకండి. మీ ఆడియన్స్ కి మేలు చేసే పనులు చేస్తూ వెళ్ళండి. మీరు చేసే పనుల ప్రతిఫలం కొంతకాలం తరువాత మీకు అందడం మొదలవుతుంది.

సేల్స్ పిచ్ ఉన్నదానికంటే, సేల్స్ పిచ్ లేని కంటెంటుని షేర్ చేయడానికే ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. మీరు అందించిన కంటెంటులో ఏ ఒక్క పోస్టు అయినా వైరల్ అయినట్లయితే అది మీకు ఎంతోమంది కొత్త followerలను తెచ్చి పెడుతుంది. అందువల్ల ఏ పోస్టు అయితే ఎక్కువమందిని ఆకట్టుకుంటూ, ఎక్కువ likes పొందుతూ ఉంటుందో దానినే మరింత ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం update చేయడానికి వీలు కానట్లయితే కంటెంటు రాయడానికి కూర్చున్నప్పుడల్లా కొన్ని అదనపు పోస్టులను రాసి సిద్దంగా ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడు publish/post బటన్ నొక్కినా వెంటనే అది పోస్ట్ అయ్యేలా ఉండాలి. ఎప్పుడో ఒకసారి తీరిక సమయం దొరికే బ్లాగర్లకు ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *