facebook fan page రహస్యాలు-1

Facebook fan page సృష్టించడం ఎలా?

fan page create చేయడం చాలా సులభం. అయితే page సృష్టించడం కన్నా దానిని పాపులర్ చేయడమనేదే క్లిష్టమైన పని. నిజానికి మీరందరూ దృష్టి పెట్టాల్సింది కూడా ఈ విషయం పైనే.

మీ పేజీకి తగిన, సరిగ్గా సరిపోయే పేరుని ఎంచుకోండి. ఆదరబాదరగా ఎదో ఒక పేరుని ఎంచుకోకుండా, పేజీ మొదలు పెడదామని అనుకున్న వెంటనే పేరు గురించి కూడా రీసెర్చ్ చేయడం ప్రారంభించండి. fan page మీ brand మాత్రమే కాదు, మీ facebook url కూడా. వీలయినంత మటుకు మీ ఆడియన్స్ సులభంగా గుర్తుంచుకునే పేరునే ఎంచుకోవడం మంచిది.

లాండింగ్ పేజి visualగా ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దండి. visitorలు fan pageలోకి అడుగు పెట్టగానే ముందుగా గుర్తించేది ఈ విషయాన్నే. అన్ని fan pageల లాగా ఒకే మూసలో ఉండకుండా భిన్నంగా, ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం చేయాలి. మీ nicheకి తగిన ప్రొఫైల్ image ని సెలెక్ట్ చేసుకోండి. వెయ్యి పదాలలో కూడా చెప్పలేని విషయాలను లాండింగ్ page design, ప్రొఫైల్ image ల ద్వారా చెప్పవచ్చు. కనీసం ఒక పారాగ్రాఫు కూడా చదవకుండానే పాఠకుడు ఈ రెంటి ద్వారా ఆ పేజీ యొక్క ప్రాముఖ్యతను గ్రహించగలుగుతాడు.

మీ కంపెనీ, ప్రోడక్ట్ ల గురించి వీలయినంత సమాచారాన్ని అందజేయండి.

  • మీ అనుభవం
  • ఇతరులతో పోలిస్తే మీ products ప్రత్యేకతలు
  • ఏయే products అందిస్తున్నారు? వాటి వివరాలు.

కేవలం మీ products గురించి మాత్రమే పోస్టు చేయకండి. మీరెంచుకున్న నిచేలో ఉపయోగకరమైన కంటెంటు ఇతరులు పోస్టు చేసినా సరే దానిని మీ పేజీలో షేర్ చేయవచ్చు. దీనివల్ల ఆడియన్స్ కి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం text కంటెంటు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు మరియు ఇతర ఫార్మాట్లని కూడా పోస్టు చేస్తూ ఉండండి. ఒకే ఫోర్మట్లోని కంటెంటుని మాత్రమే పోస్టు చేస్తూండడం సరైనది కాదు.

fan page రూపొందించగానే సరిపోదు. దానిని నిరంతరం update చేస్తూండాలి. కొత్త కంటెంటుని పోస్టు చేస్తూ యూజర్లని ఎంగేజ్ చేస్తూండాలి. అప్పుడే fan page యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మీరు కొన్నిరోజులు బిజీగా ఉండి fan pageని update చేయకుండా ఉంటె facebook ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తుంది కూడా…

పేజి రూపొందించిన వెంటనే ఈ పేజీని like చేయవలసిందిగా ఇదివరకే ఈ నిచేపై ఆసక్తి ఉన్న కొంతమంది మీ స్నేహితులకి ఆహ్వానం పంపవచ్చు. అందువల్ల ఓ పేజీకి ప్రారంభ దశలో అవసరమైన boost లభిస్తుంది. ఆ తరువాత దానంతట అదే నెమ్మదిగా పాపులర్ అవడం మొదలవుతుంది. కేవలం అయిదో, పదో లైకులు మాత్రమే ఉన్న పేజీపై సమయాన్ని స్పెండ్ చేయడానికి, LIke చేయడానికి ఎవ్వరూ పెద్దగా ఆసక్తిని చూపరు. అదే అదివరకే ఓ మూడు వందల లైకులు గనక ఉంటే ఇదేదో సీరియస్ విషయంలా ఉంది అని కొంత సమయాన్ని కేటాయించి చూసే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల మొదట్లో కొన్ని లైకులు సంపాదించడానికి మీ సన్నిహితుల సహాయం తీసుకోవచ్చు, లేదా facebook Ads నుపయోగించి కొంత ఖర్చు పెట్టగలిగితే (చిన్న మొత్తమే) 500-1000 లైకులు పొందగలగడం పెద్ద కష్టమేమీ కాదు.

సమయాన్ని కేటాయించగలిగితే facebook లో మీ నిచేపై ఆసక్తి ఉన్నవారిని వెతికి పట్టుకోవడం సులభమైన పనే. ఇలాంటివారిని పట్టుకుని మీ పేజీని like చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *