Facebook adsలో audienceని ఎలా టార్గెట్ చేయాలి?

How to target your audience in Facebook Ads?

ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి?

facebook లో అకౌంటు తెరిచేటపుడే ప్రతీ యూజర్ తను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ స్కూలులో, కాలేజిలో చదువుకున్నాడు, తన ఇష్టాలేమిటి, హాబీలేమిటి, అభిరుచులు ఏమిటి లాంటి సమాచారాన్ని తెలపడం జరుగుతుంది. వీటిని బట్టే వీరికి తగిన ads ని facebook ప్రదర్శించడం చేస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం మీ హాబీ అన్నప్పుడు దానికి సంబంధించిన ads ( స్టాక్ మార్కెట్ softwareలు, online ట్రేడింగ్ సంస్థలు, ట్రేడింగ్ ని నేర్పించే వీడియో కోర్సులు….లాంటి ads ) మీ feed లో ప్రదర్శింపబడతాయి.

టీవీలలో అయితే ads ఫలానా వారికి అన్న భేదం లేకుండా మహిళలు, పురుషులూ, పిల్లలు, పెద్దలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులూ ఇలా తేడా ప్రతీ ad అందరికీ చూపించబడతాయి. ఇందులో ఒక్కో ad ఒక్కో రకం జనాలను ఆకర్షిస్తుంది, వారిని మాత్రమే చేరుకుంటుంది. మిగతావారు దాని గురించి  అసలే పట్టించుకోరు. ఉదాహరణకి ఒక రైతు తన పొలంలో చీడల నిర్మూలనకు ఉద్దేశించిన pesticide ప్రకటన పట్ల ఒక software ఇంజనీర్ కి ఎలాంటి ఆసక్తి ఉండదు, నిజానికి ఆ ప్రోడక్ట్ వల్ల వారికి ఎలాంటి ఉపయోగం కూడా లేదు.

అలాగే మొటిమల నివారణకి పనిచేసే ఓ cream గురించి 12-20 సంవత్సరాల వయసు వారికే చూపించడం అవసరం, 60 ఏళ్ళ వృద్ధులకి దానితో పనిలేదు.

అలాగే ఇది vice versa గా కూడా పని చేస్తుంది. అంటే ఒక software ప్రోడక్ట్ గురించి రైతుకి ఎలాంటి interest ఉండదు.

టీవీ, దిన పత్రికలూ ఇవన్నీ ఓ specific వర్గం వారికి మాత్రమే ప్రకటనలు చూపించకుండా broadగా అందరు ప్రేక్షకులకి ఒకే ads ని చూపిస్తాయి.

కానీ facebook అలాకాదు. ఇది మీ ads పట్ల ఎవరికీ ఆసక్తి ఉందొ వారికే ఆ ad ని ప్రదర్శిస్తాయి. దీనివల్ల ఆసక్తి, అవసరం లేనివారికి చూపించడంలో వినియోగమయ్యే time, మనీ లాంటి వనరులు పొదుపు చేయబడి ఫలితాలు మెరుగ్గా వస్తాయి.

మీరు display చేయాలనుకుంటున్న ad ఎవరిని టార్గెట్ చేయాలి (ఎవరికి చూపించబడాలో-demographics) facebookలో ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ ప్రకటనలపై ఖర్చు పెట్టే మీ సొమ్ము, మీ సమయం ఆదా అవుతాయి. మీరిలా ఒక్కో demographic ని ఎంచుకుంటున్న కొద్దీ, ఆ విభాగంలో ఎంతమంది viewersకి చూపించవీలవుతుందో facebook సూచిస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి మీరు దీనిని ఎక్కువమందికి లేక తక్కువమందికి చూపించబడేలా మార్చుకోవచ్చు.

ఇందులో

 • ప్రాంతం (దేశం/రాష్ట్రం/పట్టణం)
 • వయస్సు
 • మహిళలు/పురుషులు
 • profession

ఇలా మీ ad ఎవ్వరికి చేరుకోవాలో మీకు ఖచ్చితమైన అవగాహన ఉంటే మీ ad campaign తప్పకుండా విజయవంతమవుతుంది. మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారో, వారి ఇష్టాఇష్టాలు ఏమిటో మీకు తెలిసి ఉండాలి.

Create Facebook Compliant Ads

అవకాశముంది కదాని మనకిష్టమొచ్చినట్లుగా ads ఇవ్వడానికి వీలులేదు. ప్రతీ ప్రకటనా facebook యొక్క నియమనిబంధనలని పాటిస్తేనే approval లభిస్తుంది.

 • ఆటోమాటిగ్గా play అయ్యేటటువంటి ఆడియో, అనిమేషన్ ఫైళ్ళని facebook అంగీకరించదు. యూజర్లను Offend చేసే (మనోభావాలను దెబ్బతీసే), spam ad లను తిరస్కరిస్తుంది. ad లో ఉపయోగించిన image, textలు, ఆ ప్రకటనలో ఉద్దేశించిన ప్రోడక్ట్, service లకు సంబంధం కలిగినవిగా ఉండాలి. సంబంధంలేని (irrelevant) imageలు ఉపయోగించ వీలు లేదు.
 • ad viewersని పక్కదోవ పట్టించేవిధంగా ఉండకూడదు. అమలు చేయ వీలుకాని వాగ్దానాలు చేయరాదు.

Landing page:

viewer ఓ ad పై క్లిక్ చేసినపుడు అది ఏ page లోకి దారితీస్తుందో అదే landing page. మీ ad లోని  Landing page గనక malwareలు, ఇతర అనుమానాస్పద site ల్లోకి దారి తీస్తూ ఉంటే ఆ ad కి ఆమోదం లభించడం కష్టమే.

ఈ క్రింది అంశాలకి చెందిన ads ని కూడా అంగీకరించదు.

 • మద్యపానం, జూదం, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే ఉత్పత్తులు, సేవలు.
 • డేటింగ్ serviceలు, గర్భనిరోధక సాధనాలు
 • చట్టవ్యతిరేక ఉత్పత్తులు, సేవలు.
 • ఫార్మాస్యూటికల్ అంశాలపై కూడా ఫిల్టరింగ్ జరుగుతుంది.
 • హింసను ప్రేరేపించే ప్రకటనలను నిర్ద్వంద్వంగా facebook తిరస్కరిస్తుంది.

పై అంశాలలో కొన్ని, దేశాన్ని బట్టి, ఆ దేశ స్థానిక చట్టాలను, నిబంధనలను బట్టి నిర్నయమవుతాయి. ఒక అంశం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి కేవలం ఒక దేశంలోని చట్టాలకు మాత్రం విరుద్దంగా ఉంటే ఆ దేశంలోని facebook యూజర్లకి ఆ ads ప్రదర్శింపబడటం జరగదు.

facebook యొక్క advertisements నియమనిబంధనలు కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉండే అవకాశముంటుంది కాబట్టి నిరంతరం గమనిస్తూ ఉండాలి.

మీ ad campaign సక్సెస్ అయ్యిందా లేదా track చేయడం ఎలా?

ad campaign మొదలయిన కొంత time period తరువాత మీ మార్కెటింగ్ ప్లాన్ విజయవంతమయ్యిందా లేక విఫలమయ్యిందా అని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ విజయవంతమయితే

 • అదే campaign ని కొనసాగించవచ్చు.
 • ఆ campaign ని ఆధారంగా చేసుకుని మరిన్ని campaignలు Run చేయవచ్చు.

దీనికోసం మీ ad campaign ను track చేయాల్సి ఉంటుంది. దీనికోసం ads managerలోని Reports విభాగంలో మీ campaign కి సంబంధించిన statistics పొందుపరచబడి ఉంటాయి.

మీ ad ను చూసిన వారెందరు? ఎంతమంది click చేసారు?

 • ad campaign మొదలు పెట్టకన్నా ముందు మీ site performance ఏ స్థాయిలో ఉంది, ad campaign తరువాత ఆ performanceలో వచ్చిన మార్పు ఏమిటి బేరీజు వేసుకుంటే ఆ campaign హిట్టా కాదా మీకే తెలిసిపోతుంది.
 • మూడు నాలుగు రకాల వేర్వేరు ad campaignలు run చేసి అందులో ఏది మంచి performance ఇస్తున్నదో దానిని కొనసాగిస్తూ మిగతా వాటిని ఆపివేయవచ్చు. ఇదో మంచి టెక్నిక్. ఇలా campaignలు run చేస్తూ ఉంటే కొంతకాలానికి మీకు మంచి అవగాహన కలుగుతుంది.

Total impressions:

మొత్తంమీద మీ ad ఎన్నిసార్లు facebook యూజర్లకి ప్రదర్శింపబడింది అనేదానిని సూచిస్తుంది.

Unique impressions:

ఒక ad ఒక యూజర్ కి ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా చూపించబడుతుంది. ఇవన్నీ కలుపుకుంటే అది Total impressions అవుతుంది. అలాకాకుండా అదనంగా చూపించబడినవి తీసివేసి కేవలం unique యూజర్లని మాత్రమే లెక్కించే పద్ధతి ఇది.

Total clicks:

మీ ad కి లభించిన క్లిక్కుల సంఖ్య.

Unique clicks:

కొన్నిసార్లు ఒకే యూజర్ ఒకటి కన్నా ఎక్కువసార్లు మీ ad పై click చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఒకటి కన్నా ఎక్కువగా చేసిన క్లికులను తొలగించినపుడు వచ్చేదే Unique clicks.

Total click through rate (CTR):

మొత్తం impression లలో క్లిక్కులుగా మారిన వాటి శాతాన్నే click through rate (CTR) అంటాము. ఉదాహరణకి మొత్తం 100 impressionల నుండి 14 clickలు లభించినపుడు CTR 14 అవుతుంది. ఈ CTR ఎంత ఎక్కువగా ఉంటే campaign అంత విజయవంతమయిందన్నమాట.

Total spent:

campaignలో మీరు ఖర్చు చేస్తున్న మొత్తం సొమ్ము.

ఈ రిపోర్టులను weeklyగా లేక monthlyగా చూసుకోవచ్చు. weekly రిపోర్టులు sundayతో మొదలవుతుండగా monthly రిపోర్టులు ఒకటోతారీఖు నుండి start అవుతాయి.

facebookలో ads ప్రదర్శించడానికి సరైన సమయం ఏది?

ads ప్రదర్శించడానికి కూడా సరైన సమయముంటు౦దా?

అవును.

ఎప్పుడైతే viewer కి విశ్రాంతి లభించి, ఎటువంటి తొందర లేకుండా కూల్ గా facebook ని open చేస్తాడో అప్పుడు మీ ad పై దృష్టి పడి ఆసక్తితో దానిపై క్లిక్ చేసే అవకాశముంటుంది. బిజీగా ఉండి, కేవలం ఒక్క నిముషం కొరకు Fb లోకి వచ్చినా కూడా మీ ad ను చూసే తీరిక లేకుండా ఉండే అవకాశముంది. దీని వల్ల impressions వృధా అయి CTR తగ్గిపోతుంది. కాబట్టి మీ నిచేలోని యూజర్లు ఏ సమయంలో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటారో ఆ సమయంలోనే ads ప్రదర్శించడం శ్రేయస్కరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *