Ten tips to success in Network Marketing (in Telugu)-5

ఈ రంగంలోనే స్థిరంగా కొనసాగుతూండడం:

సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన ఒక యువకుడు కొన్ని సినిమాలకు పని చేసినతరువాత కొంత అనుభవం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని నైపుణ్యాలను, టెక్నికల్ విషయాలను, పద్దతులను పూర్తిగా అవగాహన చేసుకుంటాడు. భవిష్యత్తులో సొంతంగా సినిమా తీయదలిస్తే ఇన్ని రోజుల అనుభవం అప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కానీ అదే యువకుడు, ఏదో ఒక దశలో నిరాశ చెంది ఏ కిరాణా కొట్టులో గుమస్తాగా పని చేయడమో లేక స్వయంగా ఒక హోటల్ ను ప్రారంభించడమో చేస్తే ఈ అనుభవమంతా నిరుపయోగమవుతుంది. సినిమా నిర్మాణంలో నేర్చుకున్న skills ఏవీ కూడా ఈ కొత్త వృత్తులలో ఏమాత్రం ఉపయోగ పడవు.

network marketingలో కూడా కొంత కాలానికి మీరు కొన్ని skills నేర్చుకుని కొంత అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఆ తరువాత ఏదైనా కారణం చేత మీరీ రంగాన్ని వొదిలిపెడితే మీ అనుభవమంతా వృధా అవుతుంది. అందువల్ల వీలయినంత మటుకు ఇదే రంగంలో కొనసాగడం మంచిది. ఒక product విషయంలో విఫలమైనా, ఆ అనుభవం మరో product విషయంలో ఉపయోగపడుతుంది.  పరాజయం లభించినా క్రుంగిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కొద్దికాలానికి ఓ product ని చూడగానే దాని లోటుపాట్లు, plus పాయింట్లు, మైనస్ పాయింట్లు, దానిని మార్కెట్ చేయగలుగుతామా లేదా,  product ధర ఎలా ఉంది లాంటి విషయాలన్నీ కూడా మీరు చెప్పగలుగుతారు.

ఒక product లో ఫెయిల్ అయినా మరో product లో మరోసారి ప్రయత్నించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీనికీ ఒక హద్దు ఉంటుంది. ఆరు productలకి పని చేసి మల్లె ఫెయిల్ అయి ఏడో network లో మళ్ళీ జాయిన్ అవ్వడం ప్రాక్టికల్ గా సాధ్యమే అయినప్పటికీ మీకు network నిర్మించుకోవడం మాతరం కష్టమవుతుంది. మీరిలా చాలాసార్లు network లు మారుస్తూ ఉన్నట్లయితే మీకు మార్కెట్లో విశ్వసనీయత పెద్దగా ఉండకపోవచ్చు.

నేర్చుకుంటూ ఉండడం:

ఈ రంగంలో ముందుకెల్లాలనుకునేవారు నిరంతరం కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి. మితభాషులుగా ఉంటూ, ఇతరులతో కలివిడిగా ఉండడం అలవాటు లేనివారు, చొచ్చుకుని పోయే స్వభావం లేనివారు మొదట్లో కాస్త ఇబ్బంది పడొచ్చు. కానీ కొద్దిగా కష్టపడి వీటిని నేర్చుకుని అలవాటు చేసుకుంటే విజయం త్వరలోనే మీసొంతమవుతుంది.

skills ని నేర్చుకోవడం అత్యంత అవసరం.

 • ఇతరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం
 • presentation skills: బిజినెస్ ప్లాన్ ని వివరించగల నైపుణ్యం
 • మీ downline మార్కెటర్ల సందేహాల నివృత్తి చేయడం, వారి భయాలను పోగొట్టి ఉత్సాహాన్ని నింపడం.
 • వారికి అవసరమైన శిక్షణ అందేలా చూడటం
 • మీ downlineలో మంచి నాయకులను తయారు చేయడం. తద్వారా కొంత కాలం తరువాత మీ ప్రమేయం లేకుండా networkని వారే నడిపించేలా తీర్చిదిద్దటం.

సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం:

కేవలం సంప్రదాయ పద్ధతులనే కాకుండా ఈ మధ్య చాలా పాపులర్ అయిన సోషల్ మీడియాను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకున్నప్పుడే మీ విజయం మరింత సులువవుతుంది.

ఈ సోషల్ మీడియాలో మీరు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినవి

 • Facebook
 • Twitter
 • Google +
 • Youtube
 • Pinterest
 • Instagram
 • LinkedIn

ఈ రోజుల్లో ఎక్కువమంది గూగుల్ కంటే facebookలోనే ఎక్కువగా search చేస్తున్నారనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూండడం వల్ల

 • కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు
 • మీ జట్టును నిరంతరం ఉత్సాహపరుస్తూండవచ్చు
 • ఎల్లప్పుడూ మీ team తో టచ్ లో ఉండవచ్చు.
 • వీలయినంత ఎక్కువ మందికి మీ సందేశం చేరేలా చేయవచ్చు
 • శిక్షణా కార్యక్రమాలు మొదలైన వాటి గురించి అందరికీ ఒకేసారి తెలపవచ్చు.
 • మీ networkలోని success storiesని అందరితో పంచుకుని వారిలో ఉత్తేజాన్ని నింపవచ్చు.
 • మీ టార్గెట్లు, వాటిని సాధించినపుడు లభించే బహుమతుల గురించి ప్రచారం చేయవచ్చు.

Duplication:

ఒకవేళ మీరు కొత్తగా networkలో చేరినట్లయితే గనక “ఎలా సక్సెస్ అవ్వాలి?” అన్న దాని గురించి మధనపడుతూండవచ్చు. మీ ప్రశ్నకి సమాధానం చాలా సంక్లిష్టమైనదేమీ కాదు. మీరే కాదు, ఎవ్వరైనా సరే సక్సెస్ సాధించడానికి ఒక చిన్న సీక్రెట్ చెబుతాను.

అదే Duplication. అంటే కాపీ కొట్టడం లేదా అనుకరించడం.

అవును …ఇంతే…చాలా సింపుల్ కదూ.

మరి దేనిని అనుకరించాలి?

మీ networkలో ఇదివరకే సక్సెస్ అయినవారు కొంతమంది ఎలాగూ ఉంటారు. వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని సంపాదించుకోండి. అది వీలు కాకపొతే కనీసం వారు బిజినెస్ చేస్తున్న పద్దతిని దగ్గరగా పరిశీలించే ఛాన్స్ పొందండి. అంతే, …..అంతకు మించి ఏమీ లేదు.

ఆ పద్దతిని ఆమూలాగ్రం పరిశీలించి, ఆకళింపు చేసుకుని దాన్ని కాపీ కొట్టండి, అంటే దానిని అనుకరించే ప్రయత్నం చేయండి. ఇంతకుమించి మరేమీ అవసరం లేదు.

సక్సెస్ పొందడం నిజానికి ఇంతే సులభం. ఈ ఒక్క చిట్కాను follow అయినట్లయితే ఎవరైనా successని పొందవచ్చు.

All the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *