Ten tips to success in Network Marketing (in Telugu)-4

ఆశావాదంలోనే కొనసాగడం:

మీరు కలిసిన ప్రతీ వ్యక్తీ convince అయిపోయి వెంటనే మీ productని కొంటాడనుకోవడం మీ భ్రమ. ఎంత గొప్ప productనైనా తిరస్కరించేవారు తప్పనిసరిగా ఉంటారు. వారికి ఆ product తో అవసరం లేకపోవచ్చు.

అందుకని తిరస్కరింపబడటం, వైఫల్యం ఒక మామూలు విషయంలా భావించండి. ఒక్కోసారి ఒకరోజు ముగ్గురు కొత్త వ్యక్తులను కలిస్తే ఆ ముగ్గురూ కూడా negative గా వ్యవహరించవచ్చు. మరోసారి మరో ముగ్గురిని కలిస్తే  ఆ ముగ్గురూ కూడా తమ ఆమోదం తెలపవచ్చు. ఇది random గా జరిగే విషయం. అందువల్ల వైఫల్యం రాగానే కుంగిపోవడం సరైంది కాదు. motivational quotes, motivational pictures, సాంగ్స్ , మీ upline తో నిరంతరం టచ్ లో ఉంటూ వారి సలహాలూ సూచనలూ పొందుతూండటం …..లాంటి వాటి ద్వారా నిరాశనూ దరిజేరనీయకుండా ఉత్సాహంగా ఉండవచ్చు. మీరు నిరుత్సాహంలో ఉంటే మీ downline కూడా డీలా పడిపోతుందని మరువవద్దు.

Downline ని ప్రోత్సహిస్తూ నిరంతరం వారికి సహాయం చేస్తూండడం.

ఓ భవంతి ఎంత ఎత్తుకి నిర్మించాలని అనుకుంటే దాని పునాదులు కూడా అంతే దృఢంగా ఉండాలి అన్న విషయం మనందరికీ తెలుసు. పునాదులు బయటికి మన దృష్టికి కనిపించనంత మాత్రాన వాటిని తక్కువ అంచనా వేయలేం. అలాగే network marketingలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మీ క్రిందివారు (Downline) కూడా అంటే పటిష్టంగా ఉండాలి. అయితే మీ వద్ద జాయిన్ అయిన ప్రతీ ఒక్కరికీ ఈ బిజినెస్ గురించి అవగాహన, అనుభవం ఉండకపోవచ్చు. అందువల్ల ప్రతీ ఒక్కరికీ అవసరమైన సహాయం అందిస్తూ, నేర్పిస్తూ క్రమంగా మెరికలుగా మార్చే ప్రయత్నం చేయాలి. ఎక్కువ సందర్భాల్లో మిమ్మల్ని చూసి, అనుకరించి informalగా నేర్చుకోవడం జరుగుతుంది.

వ్యక్తిగత వేషధారణ, body language లను కలిగిఉండడం:

marketing రంగంలో ఈ రెండూ తప్పనిసరి. ఓ కస్టమర్ కొనుగోలు నిర్ణయాన్ని పరోక్షంగా ఈ రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి.

వేషధారణ:

పరిశుభ్రత: ఇది marketing రంగంలోని వారు ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సిన లక్షణం. దీనివల్ల కస్టమర్ కి మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. Neatగా shave చేసుకోవడం, ఇస్త్రీ దుస్తులు ధరించడం, చక్కగా polish చేసిన shoes వేసుకోవడం తప్పనిసరి. జుట్టు కూడా చక్కగా cut చేయబడి, చిన్నగా professional గా ఉండాలి. పొడవుగా ఉండకూడదు.

No smoking: పొగ తాగడం, గుట్కా తినడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల వల్ల కస్టమర్ కి మీరంటే తక్కువ అభిప్రాయం కలిగే ప్రమాదముంది. పైపెచ్చు వీటికి దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి కూడా మంచిదే.

Body language:

  • నీరసంగా వంగిపోతున్నట్లుగా కాక, నిటారుగా ఉండాలి.
  • నిరంతరం చిరు నవ్వుని కలిగి ఉండాలి. పగలబడి నవ్వడం, లేక సీరియస్ గా ఉండడం ఈ రెండూ కూడా కస్టమర్ కి మీపై మంచి అభిప్రాయాన్ని కలగజేయవు.
  • ఎదుటివారి కళ్ళలోకి చూడగలగాలి. ఇది మీయొక్క ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. అయితే మాట్లాడుతున్నంత సేపు వారి కళ్ళల్లోకి చూస్తూనే ఉండటం కూడా సభ్యత కాదు. దానివల్ల వారు ఇబ్బంది పడే అవకాశముంది. ఎంతసేపు చూడాలి అనేది, సందర్భాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి తప్ప నిర్దిష్టమైన rules and regulations అంటూ ఏమీ లేవు. మధ్య మధ్యలో gap ఇస్తూ మీరు రాస్తున్న పేపర్ వైపు, ఆ వ్యక్తీ చేతుల వైపు చూస్తూ మాట్లాడవచ్చు.
  • ఎదుటివారు చెప్పేది తప్పనిసరిగా వినాలి. మీ ఆలోచనల్లో మీరు ఉండడం వల్ల వారు చెప్పేదేమిటో మీరు గ్రహించలేరు. వినడం మాత్రమె కాక  వింటున్నట్లుగా తల ఊపడం, మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు అడగడం చేయాలి.

కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులను జాయిన్ అవ్వమని పదేపదే అభ్యర్థించకపోవడం:

network లో చేరిన తరువాత మీ సొంత team ను ఏర్పాటు చేసుకోవాల్సివచ్చినపుడు మొట్టమొదటగా గుర్తుకొచ్చేది మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులే. వీరి తరువాతే మిగతా ఎవరైనా గుర్తుకొచ్చేది.

అయితే నిజంగానే వీరితోనే మీ network బిజినెస్ ని ప్రారంభిస్తారా! ఇలా చేయడం సరైనదేనా ?

కాకపోవచ్చు…. మీ కుటుంబ సభ్యులూ, స్నేహితులూ మీరు చెప్పింది ఏమాత్రం అర్థం కాకపోయినా, మీకోసం, మిమ్మల్ని చూసి జాయిన్ అవ్వొచ్చు. కానీ దాని తరువాత పరిస్థితి ఏంటి?

మీ క్రింద జాయిన్ అయ్యే వారు ఎంత చురుకుగా పనిచేస్తే అంత మీకు ప్రయోజనం కలుగుతుందని తెలుసుకున్నాం కదా. ఎలాంటి ఆసక్తి లేకుండా కేవలం మీ కొరకే జాయిన్ అయిన వారిచేత బలవంతంగా బిజినెస్ చేయించలేము కదా. కాబట్టి వీరిని చేర్చుకోవడం వల్ల తాత్కాలిక లాభమే తప్ప, దీర్ఘకాలంలో తెల్ల ఏనుగుల్లా, ఉత్సవ విగ్రహాల్లా ఉండి వీరివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *