Ten tips to success in Network Marketing (in Telugu)-3

దీనికి భిన్నంగా కొంత ప్రయత్నం చేసి ఫలితం లభించక, మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఈ Network marketing పద్ధతినే విమర్శించేవారు కూడా కోకొల్లలుగా కనిపిస్తారు. నిజానికి ఇలాంటివారే ఎక్కువగా కనిపిస్తారు. ఒక సంస్థలో చేరి ఆ తరువాత తీరిగ్గా బాధ పడకుండా ఉండాలంటే ….

 • జాయిన్ అయ్యే ముందుగానే product ని ఉపయోగించి, పరీక్షించి చూడాలి. మీకు నమ్మకం, సంతృప్తి లేని product గురించి మీరు ఇతరులకి వివరించలేరు. మీకు నచ్చిన దాని గురించి చెప్పేటపుడు ఆటోమేటిక్ గా మీ స్వరంలో నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఎదుటివారికి కనిపిస్తాయి.
 • ముందుగా మీరు పెట్టే పెట్టుబడి కోల్పోయినా కూడా నాకు పెద్దగా నష్టం లేదు అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి. మీకు ఏమాత్రం ఈ బిజినెస్ గురించి తెలీకపోతే ఒకేసారి అధికమొత్తం అవసరమయ్యే networkలో అడుగుపెట్టకండి.
 • online లో కంపెనీ గురించి రివ్యూలు చదవండి. వాటిలో పాజిటివ్, నెగటివ్, మిశ్రమ …..ఇలా అన్నిరకాల అభిప్రాయాలుండవచ్చు. వాటన్నింటినీ చదివి ఓ నిర్ణయానికి రండి.
 • వీటి ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని మీ sponsor ని నిస్సంకోచంగా అడగవచ్చు. వారు చెప్పే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లయితే సందేహించాల్సిందే.

చాలామంది ఔత్సాహికులు ఈ network ల్లోకి చేరడం, కొద్దికాలంలోనే విఫలమై ఈ రంగంనుండి నిష్క్రమించడం జరుగుతున్నది. ఈ రంగాన్ని వదిలివేయడానికి ఎన్నో కారణాలుండవచ్చు. వాటిని విశ్లేషిస్తే ఈ క్రిందివి ప్రదానమైనవిగా భావించవచ్చు.

పొరపాటు అంచనాలు: ఈ బిజినెస్ ను సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల, కొత్తగా చేరేవారిలో అనేక తప్పుడు అంచనాలు, భావనలు ఏర్పడుతాయి. ఉదాహరణకి….

 • ఈ బిజినెస్ లో విజయం సాధించడం చాలా సులభం.
 • నా పని కేవలం ఇద్దరినీ/ముగ్గురిని recruit చేయడమే. అక్కడితో నా పని అయిపోతుంది. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు.
 • నా ఫ్రెండ్స్ అందరూ ఎగిరి గంతేసి ఒప్పుకుని join అవుతారు.
 • మొదటి నెలలో x ఆదాయం, రెండో నెలలో Y ఆదాయం గ్యారంటీ. దీంతో ఆరు నెలల్లోగా లక్షాధికారి అయిపోవడం ఖాయం

వాస్తవంగా ఈ అంచనాలు నెరవేరడం అటుంచి, కనీసం దగ్గరికి కూడా చేరుకోలేకపోవడం వల్ల అసంతృప్తి మొదలవుతుంది.

తగిన శిక్షణ, అనుభవం లేకపోవడం:

కొత్తగా జాయిన్ అవుతున్నవారిలో “బిజినెస్ ఎలా చేయాలి?” అనేదానిపై అనుభవం లేకపోవడం సహజమే, ఇందులో కొత్తేమీ లేదు. అలాగే చాలామందికి ఈ విషయంలో తగిన ట్రైనింగ్ కూడా ఉండకపోవచ్చు. అయితే ఎవరైతే sponsorలు ఉంటారో వారు, తమ downline గురించి శ్రద్ధ తీసుకుని తగిన నైపుణ్యాలు అందించే ప్రయత్నం చేయడం అవసరం.

Networkలో చేరినవారు ఎంత ఎక్కువగా నేర్చుకుని బిజినెస్ చేస్తే, అంత ఎక్కువగా అందరికీ ప్రయోజనమన్న విషయాన్ని కొన్ని కంపెనీలు మాత్రమె గుర్తిస్తాయి.  ఇలాంటి తమ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే కంపెనీలు వీరికోసం ప్రత్యెక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్థాయి. ఇవే నిజమైన వ్యాపార సంస్థలు. కంపెనీ ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం లేదంటే వారి నిబద్దతను అనుమానించాల్సిందే.

కేవలం డబ్బు కోసమే network లోకి ప్రవేశించడం:

డబ్బెవరికి చేదు?

ప్రతీ ఒక్కరూ ఏ వ్యాపారంలోకైనా ఎందుకు అడుగు పెడతారు. డబ్బు కోసమే కదా !

ఏ వ్యాపారమైనా మొదట్లో నెమ్మదిగా ప్రారంభమై, కస్టమర్ల నమ్మకాన్ని పొందుతూ, క్రమంగా తన విలువనూ, brand నూ పెంచుకుంటుంది. వినియోగదారులకు ఏదో రకంగా ప్రయోజనాన్ని కలిగిస్తూ, తద్వారా తను కూడా లాభాన్ని పొందటం. network marketing కూడా అంతే.

అయితే జాయిన్ అయిన వెంటనే ప్రతిఫలాన్ని ఆశించడం మాత్రం సరైంది కాదు. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో తగిన ఓపిక అవసరం. అయితే చాలామంది గుర్తించని మరో విషయమేమిటంటే ఈ బిజినెస్ లో డబ్బుతో పాటు మరికొన్ని నైపుణ్యాలు మీకు తెలీకుండానే అలవడుతాయి. ఉదాహరణకి..

 • లీడర్ షిప్ లక్షణాలు
 • ఇతరులతో మాట్లాడే skills
 • సమస్యలను పరిష్కరించడం
 • చొరవ తీసుకోవడం, చొచ్చుకుని పోవడం
 • కొత్త విషయాలను నేర్చుకోవడం
 • ఇతరులను సమన్వయ0 చేయడం

పై నైపుణ్యాలన్నీ  కూడా మీరు సంపాదించే డబ్బుతో పాటు అదనంగా వచ్చి చేరుతున్నాయి. వీటి విలువ అమూల్యం.

వైఫల్యాలను అధిగమించి, విజయాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకుని, వాటిని తూచా తప్పకుండా పాటించడం చేయాలి. అలాంటి కొన్ని రహస్యాలు …….

10 సీక్రెట్స్:

Art of Selling:

అమ్మకం అనేది ఒక కళ. అయితే కాస్త కష్టపడితే, దానిలోని లోటుపాట్లు గ్రహించగలిగితే ఈ కళను నేర్చుకోవచ్చు కూడా.

మీరిప్పటివరకూ ఏవో ఇతర వృత్తుల్లో పని చేస్తూ ఉండి ఉంటారు. లేదా నిరుద్యోగిగా ఉంది మొదటి సారి ఈ network marketingలోకి అడుగు పెట్టారు కావొచ్చు, ఏది ఏమైనా ఇప్పుడిక Art of Sellingని నేర్చుకోవాలి. అపుడే మీరు సక్సెస్ ని అందుకోగలుగుతారు. మరి ఇదెలా సాధ్యం?

మీ product వల్ల కస్టమర్ కి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో దానిని స్పష్టంగా వివరించండి. అదే ముఖ్యమైన విషయం. తనకి ఏదో మేలు, లాభం కలుగుతుందంటే వినియోగదారుడు తప్పకుండా ఆ product ని కొనుగోలు చేస్తాడు. దీనిని పక్కనబెట్టి డిస్కౌంట్లు , ఒకటి కొంటే మరోటి free లాంటి విషయాల గురించి ఎంత చెప్పినా లాభం లేదు. కస్టమర్ కి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వస్తువును అమ్మడం అతి కష్టమైన విషయం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *