Ten tips to success in Network Marketing (in Telugu)-2

వ్యక్తిత్వ వికాసం:

Network marketingలో మీ products ని అమ్మడానికై మీరు కొత్త వ్యక్తులను కలిసి మీ ఉత్పత్తుల గురించి వారికి వివరించాల్సి ఉంటుంది. దీనివల్ల మీ సోషల్ skills అద్బుతంగా మెరుగుపడతాయి. ప్రతీరోజు ఓ ఛాలెంజ్ లాగా అనిపిస్తూ ఆ ఛాలెంజ్ లను అధిగమించినపుడు గొప్ప సక్సెస్ సాధించామన్న గర్వం కలుగుతూంటుంది. వేరే ఇతర పనుల్లో ఇలాంటి సంతృప్తి ఎప్పుడోగాని కలగదు. క్రమేణా మీ communication skills అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. పరోక్షంగా, మీ వ్యక్తిత్వం మరింత తీర్చిదిద్దబడుతుంది. వీటన్నిటితో పాటు వ్యాపార కిటుకులు, మెళుకువలు వంటపడుతాయి. దానివల్ల మరేదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలన్నీ మీరు కలిగి ఉంటారు.

Network marketing లోని ఇబ్బందులు:

Network marketing పై ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం ఒక పెద్ద మైనస్ point. పిరమిడ్ స్కీములు, సర్క్యులేషన్ స్కీములు, పొంజి స్కీముల పేరిట ఈ రకమైన బిజినెస్ లను పిలవడం జరుగుతున్నది. అయితే సామాన్య ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణం లేకపోలేదు. కొన్ని కంపెనీలు network marketing పేరుతో అనేక అనైతిక విధానాలను అనుసరిస్తూ, ప్రోత్సహించడం చేసాయి. సరయిన నియమ నిబంధనలు లేకపోవడం, ఆజమాయిషీ, నియంత్రణ లోపించడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా అర్థం చేసుకోకపోవడం:

join అవుతున్న చాలామందికి, తాము కూడా కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయన్న విషయం తెలీదు. ఈ విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా sponsorలు దాచిపెట్టి “నీకేం ఇబ్బంది లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అదంతా నేను చూసుకుంటాను.” లాంటి మాటలతో మభ్యపెట్టడం జరుగుతున్నది. వీళ్ళ మాటలు విన్నవారు “కేవలం జాయిన్ అయిపోతే చాలు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు” అన్న భ్రమలోనే ఉండి చివరకు విఫలమవుతారు.

Quality products తక్కువ:

Network marketing కంపెనీల్లో ఎక్కువ నాణ్యత లేని నాసిరకం ఉత్పత్తులనే ప్రమోట్ చేస్తున్నాయి. సరుకుల qualityని పెంచడానికి బదులుగా ఇవి marketing వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నాయి.

Network marketing ఎలా పని చేస్తుంది?

మీరు ఒక స్వతంత్ర sales executiveలాగా స్వయంగా పనిచేస్తూ, మీకంటూ ఓ teamని (downline) ఏర్పరచుకుని, వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ, అమ్మకాలు పెంచుకుంటూ సంస్థకి లాభాలను తీసుకొస్తూ మీరు కూడా తగిన ప్రయోజనాలు పొందడం. 

Team building in network marketing
Team building in network marketing

జాయిన్ అవ్వడం:  ఇదివరకే పని చేస్తున్న ఒక డిస్ట్రిబ్యూటర్ మిమ్మల్ని సంప్రదించడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇలా జాయిన్ అవ్వడం ద్వారా ఆ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ అమ్మకాలు పెంచే బాధ్యతను మీరు స్వీకరిస్తారు. దీనికి అవసరమైన నైపుణ్యాలను, శిక్షణను, సమాచారాన్ని మీ డిస్ట్రిబ్యూటర్ (sponsor) మీకందిస్తాడు. ఈ joining కోసం మీరు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా మీకు ఆ product అందజేయబడుతుంది.

Sales: Join కావడానికి ముందుగానే లేక join అయిన తరువాత గానీ మీరు ఆ product ను వినియోగించి దాని quality పట్ల సంతృప్తి చెందుతారు. ఇప్పుడు మీకు నచ్చిన ఈ product గురించి  ఇతరులకు  చెప్పి, ఒకవేళ వారు కూడా ఈ product ను కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, వారికి ఆ product ని అందించి, ప్రతిఫలంగా కంపెనీ నుండి కొంత ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఇలా మీరు ఎంత ఎక్కువ మందికి productలు అమ్మగలిగితే అంత ఎక్కువగా ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

Networkని నిర్మించడం:

improving sales in multilevel marketing
improving sales in multilevel marketing

పైన చెప్పిన పద్దతిలో ఎన్ని రోజుల వరకు కష్టపడతారో అప్పటివరకు మాత్రమే లాభాలు ఆర్జించగలుగుతారు. పనిచేయడం ఆపివేయగానే ఆటోమేటిక్ గా సంపాదన కూడా ఆగిపోతుంది. మరి అప్పుడెలా?

network marketing అనేది ఒక residual income అని చెప్పుకున్నాం. అంటే పని చేయడం ఆపివేసినా కూడా ఇంకా ఆదాయం వస్తూనే ఉంటుంది. దాని వెనక ఉన్న రహస్యమే network నిర్మాణం.

మీ క్రింద ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేసే, చురుకైన వ్యక్తులతో ఓ networkని గనక నిర్మించినట్లయితే కొంతకాలం తరువాత మీరు పనిచేయకపోయినా కూడా మీకు నిరంతరం ఆదాయం లభిస్తూనే ఉంటుంది.

మీ network లోని వ్యక్తులు పనిచేసి అమ్మకాలు పూర్తి చేసినపుడు వారి ఆదాయంలోంచి స్వల్ప మొత్తం మీకు కూడా చెల్లించబడుతుంది. ఇలాంటి వ్యక్తులు మీ network లో ఎక్కువమంది ఉన్నప్పుడు వారందరూ పని చేస్తూన్నప్పుడు మీకు ఎక్కువ స్థాయిలో ఆదాయం లభిస్తుంది. ఎంత భాగం లభిస్తుందనేది ఒక్కో network కి ఒక్కో రకంగా ఉంటుంది.

ఈ వ్యవహారమంతా చూడటానికి సులభంగానే అనిపించినప్పటికీ ఒక పటిష్టమైన network ని నిర్మించాలంటే మీ విలువైన సమయాన్ని చాలావరకు వెచ్చించాల్సి ఉంటుంది. అపుడే మంచి network నిర్మింపబడుతుంది. అంకితభావంతో కష్టపడి లక్షాధికారులయినవారిని ఎందరినో మీరు చూడవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారిలో ప్రముఖుల జాబితా ఈ లింకులో మీరు చూడవచ్చు.

http://www.vineetgupta.net/list-top-100-earners-network-marketing-2012/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *