Ten tips to success in Network Marketing (in Telugu)-1

Network marketing అంటే ఏమిటి? దానిలో విజయం సాధించాలంటే ఏం చేయాలి?

network marketing in Telugu
network marketing in Telugu

Oriflame, Amway, Tupperware, Modicare, RCM లాంటి కంపెనీల పేర్లెప్పుడైనా విన్నారా!

వీటి గురించి విని ఉంటే మీకు network బిజినెస్ గురించి ఎంతో కొంత తెలుసన్న మాటే.

Network marketing అనేది ఒక ప్రత్యేకమైన sales వ్యవస్థ. ఇది సంప్రదాయ sales system లకి భిన్నంగా, స్నేహితులకి, బంధువులకి, పరిచయస్తులకు, ఇతరులకి నేరుగా వస్తువులను అమ్మే ఒక Direct selling పద్ధతి. ఇప్పటివరకూ ఈ పద్ధతి వల్ల వేర్వేరు సామాజిక నేపథ్యాలున్న, వేర్వేరు ఆర్ధిక పరిస్థితుల నుండి వచ్చిన  లక్షలాది మంది స్త్రీ పురుషులకి ఆర్ధిక స్వాతంత్ర్య0 లభించింది.

ఈ Network marketing కే Multilevel marketing, Direct Selling, Relationship Marketing లాంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి.

సంప్రదాయ వ్యాపార పద్దతుల్లో, ఓ స్థిరమైన ప్రదేశంలో వ్యాపారాన్ని (shop ని) ఏర్పాటు చేసుకుని, వినియోగదారులు అక్కడికే  వచ్చేలా ఆశించడం జరుగుతుంది. దానికి భిన్నంగా Network marketingలో ఒక స్థిరమైన లొకేషన్ కి బదులు, అమ్మకందారుడు కస్టమర్ ఉన్నచోటికే వెళ్లి ముఖాముఖి కలిసి వ్యాపార లావాదేవీలు జరిపే ఓ పద్ధతి ఇది.

Multilevel marketing in Telugu
Multilevel marketing in Telugu

Network marketing: ప్రయోజనాలు:

రిస్కు తక్కువ: సంప్రదాయ వ్యాపారంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది. డబ్బుతో పాటు, సమయం, శ్రమ ఇవన్నీ కూడా ఖర్చవుతాయి. Network marketingలో పెట్టుబడి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది.

నిజానికి ఇక్కడ మీ నిజమైన పెట్టుబడి …మొదటిది మీ సమయం కాగా, రెండవది మీ యొక్క నైపుణ్యాలు (నాయకత్వ నైపుణ్యాలు, జట్టుని నడిపించడం, మీ క్రిందివారిని ఉత్సాహపరచడం …). ఇక్కడ రిస్కు ఉన్నప్పటికీ అతి తక్కువ స్థాయిలోనే ఉంటుంది.

నాణ్యత గల products: ఇది చాలా ముఖ్యమైనది. ఆర్థికావసరాల కోసమే మీరు Network marketingలోకి దిగినప్పటికీ మీరు ప్రమోట్ చేసే ఉత్పత్తుల నాణ్యతను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తూ అనేక Network marketing సంస్థలు మంచి quality గల ఉత్పత్తులను అందిస్తున్నాయి. వీటిలోనుంచి ఉత్తమ స్థాయి వాటిని మాత్రమే ఎంచుకుని ప్రమోట్ చేయగలిగితే మార్కెట్లో మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. అలా జరగాలంటే ఉత్పత్తులను ముందుగా మీరు స్వయంగా వాడి వాటి నాణ్యతను స్వయంగా పరీక్షించి నిర్ధారించుకున్న తరువాతే ప్రమోట్ చేసినట్లయితే ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సాఫీగా మీ వ్యాపారం ముందుకి సాగుతుంది. దీనికి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు.

  • ఇందులో Network marketing లేనట్లయితే నేను ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తానా?
  • ఈ ఉత్పత్తులని ప్రమోట్ చేయడం ద్వారా నేను నా కస్టమర్లకి ఏదైనా నిజమైన ప్రయోజనాన్ని అందించగలుగుతున్నానా?

నిరంతర వ్యాపారం:

కొన్ని ఉత్పత్తులు ఒకసారి కొనుగోలు చేస్తే మళ్ళీ చాలాకాలం పాటు కొనాల్సిన అవసరం ఉండదు (ఉదాహరణకి టీవీ, బైక్ ). మరికొన్ని వస్తువులు తరచుగా కొనుగోలు చేయాల్సివస్తుంది ( కిరాణా సరుకులు, Healthcare ఉత్పత్తులు). Network marketingలో ఇలా మళ్ళీ మళ్ళీ కొనాల్సిన వస్తువులు ఉంటే వాటిని ఎంచుకోవడం ఎంతో మంచిది. products quality బాగా ఉండి, ప్రతీ నెలా క్రమం తప్పకుండా purchase చేసే కస్టమర్లు ఉండడం వల్ల మీకు స్థిరమైన ఆదాయం (మొదట్లో తక్కువ అయినా సరే) రూపొందుతుంది.

అపరిమితమైన అభివృద్ధి (unlimited growth):

Network marketingలో మీ సంపాదనకి upper limit అంటూ ఉండదు. మీరెంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకళ్ళ ముందే కనబడుతుంది.

మీకు మీరే boss :

ఠంచనుగా పొద్దున్న 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మీకిష్టం ఉన్నా లేకున్నా ఎవరో చెప్పిన పనులన్నీ చేయడం మీకస్సలు ఇష్టం లేదా ? అయితే network marketing మీకు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మీకంటూ boss ఎవరూ ఉండరు, మీకు మీరే boss. రోజులో ఏ సమయంలో పని చేయాలో మీరే స్వయంగా నిర్దేశించుకోవచ్చు.

పార్ట్ టైం ఆదాయం: మీ ఉద్యోగాన్ని వొదిలిపెట్టి దీనికోసం ప్రత్యేకంగా full time పని చేయాల్సిన అవసరం లేదు. మీకున్న ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో network marketing కోసం కాస్త సమయాన్ని కేటాయించవచ్చు. కొంత ఆదాయం సంపాదించిన తరువాత దేనిపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలన్న విషయం ఆలోచించుకోవచ్చు.

Residual income: సంప్రదాయ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పని చేసినన్ని రోజులు మాత్రమె ఆదాయం లభిస్తుంది. ఈ సోమ్ములోనుండి ఖర్చులకి కొంత పోనూ మిగతా డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుని వృద్ధాప్యంలో అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. అంటే పని చేస్తేనే ఆదాయం లభిస్తుందన్న మాట. పని చేయడం ఆపివేసిన మరుక్షణమే మీకు ఆదాయం రావడం కూడా ఆగిపోతుందన్నమాట. అలా కాకుండా కొంత కాలం పనిచేసిన తరువాత పని చేయడం ఆపివేసినా కూడా ఆదాయం లభించే మార్గం ఉంటే ఎంత బాగుంటుంది కదూ ! అలా లభించే ఆదాయాన్నే residual income అంటారు. network marketingలో కూడా మీరు కొన్ని రోజులు శ్రమించి ఓ స్థాయికి చేరుకున్న తరువాత అప్పుడు మీకు residual income రావడం మొదలవుతుంది. మొదట్లో ఇది కొద్ది మొత్తమే కావొచ్చు కానీ మరింత కష్టపడా కొద్దీ ఈ మొత్తం కూడా పెరిగే అవకాశముంది. అయితే ఇలా నిరంతర ఆదాయం లభించాలంటే మీ teamని కూడా ఉత్సాహపరుస్తూ ఓ స్థాయికి తీసుకెళ్ళాల్సి ఉంటుందని మరిచిపోవద్దు.

Residual incomeకి మరికొన్ని ఉదాహరణలు

1.పుస్తక రచన (writer)

2.website నిర్వహణలో Ads ద్వారా వచ్చే ఆదాయం.

3.ఇంటి అద్దెలపై వచ్చే ఆదాయం.

తరువాత భాగం చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *