Is Marketing necessary (in Telugu)?

Marketing నిజంగా అవసరమా ?

ఒక ప్రోడక్ట్ యొక్క అమ్మకాల నిర్వహణనే మార్కెటింగ్ అనవచ్చు. నిజానికి ఇంత చిన్న నిర్వచనం సరిపోదు కూడా. మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ Product యొక్క ప్రయోజనాలను వినియోగదారులకు అర్థమయ్యేలా వివరిస్తూ , ఆ ప్రోడక్టు యొక్క విలువని పెంచడం. దీనివల్ల ఆటోమాటిగ్గా కస్టమర్లు ఆ ప్రోడక్టుని కొనుగోలు చేయడానికి సిద్దమవుతారు.

వినియోగదారులతో మంచి సంబంధాలు నెలకొల్పడం మార్కెటింగ్ లోని ప్రధాన అంశం. కేవలం “Selling” పైనే దృష్టి కేంద్రీకరించకుండా వినియోగదారునికి value ని అందించడం కూడా జరగాలి. అప్పుడే మార్కెటింగ్ సక్సెస్ అవుతుంది.

ఒకప్పుడు ప్రతీనెలా కిరాణా సరుకులు కావాలంటే వెళ్లి ఆ రద్దీ మధ్య లైనులో నిల్చుంటే మనవంతు వచ్చినపుడు లిస్టు అందిస్తే షాపు ఓనరు దయతలచి మన సరుకులు అందించేవాడు. ఆ ప్యాకింగూ గట్రా అంతా అయ్యేసరికి మరో అరగంట పట్టేది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఏ ఆటోలోనో, రిక్షాలోనో సరుకులన్నీ వేసుకుని ఇంటికి చేరుకునేవాళ్ళం. ఇదంతా ఓ ప్రహసనంలా ఉండేది. చిరాకు వేసేది కూడా. అంతే కాకుండా మనం లిస్టులో రాసిన brand లు లభిస్తాయన్న గ్యారంటీ ఏమీలేదు. షాపతని వద్ద ఏ బ్రాండు ఉంటె అది ఇచ్చేసేవాడు. ఆ విషయం మనకి ఇంటికొచ్చిన తరువాత గానీ తెలిసేది కాదు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చునే order చేస్తే (Amazon.com, Flipkart.com) సరుకులు మన ఇంటివద్దకే తీసుకొచ్చి డబ్బులు తీసుకుంటారన్న ఆలోచన ఆ సమయంలో ఎవ్వరికీ పొరపాటున కూడా కలగలేదనుకుంటా.

ఈ రోజుల్లో మీ షాపు ఓపెద్ద సెంటరులో రోడ్డు పక్కనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడో మారుమూలన ఉన్నా పర్లేదు. కానీ మీకంటూ ఓ website ఉండి దానికి మంచి ట్రాఫిక్ ఉండి ప్రతీరోజూ అనేకమంది ఆ siteని సందర్శిస్తూ వారికి కావాల్సిన సరుకులు order ఇస్తే చాలు. నలుగురు మెరికల్లాంటి కుర్రాళ్ళను డెలివరీ బాయ్స్ గా పెట్టుకుని అవసరమైతే ఓ swiping machineని కూడా ఉపయోగించి సరుకులు డెలివరీ చేయవచ్చు.

లేదంటే మీకంటూ online లో ఓ స్టోర్ ఏర్పాటు చేసుకొని మంచి serviceని అందించే కొరియర్ తో ఒప్పందం చేసుకుంటే మీరున్న ఊరేం ఖర్మ మొత్తం దేశంలో ఎక్కడికైనా Goodsని పంపవచ్చు.

అయితే ఇదంతా చేసి సక్సెస్ సాధించాలంటే కావాల్సింది మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది మన శరీరంలో ఆక్సిజన్ లాంటిది. అది లేకపోతె మనుగడే లేదు….. chapter close…అంతే.

మరి ఈ మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రధానంగా మార్కెటింగ్ అనేది రెండు రకాలు.

1. Online    2. Offline.

వ్యాపారంలో అనేక సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్దతులను Offline మార్కెటింగ్ గా భావించవచ్చు. ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడంతా offline మార్కెటింగ్ మాత్రమే కనిపించేది.

అప్పట్లో మార్కెటింగ్ అంతా వీటి ద్వారానే జరిగేది.

 • Television
 • Radio
 • magazines
 • stickers
 • Brochure
 • Banners
 • News papers
 • Pamphlets
 • Posters

కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడంతా Online యుగం.

Online మార్కెటింగ్ లో ఎక్కువమంది మార్కెటర్లు ఈ క్రింది పద్దతులను ఉపయోగించడం జరుగుతున్నది.

 • Article marketing
 • Blogging
 • Email marketing
 • Social media marketing
 • Forums
 • Free reports
 • Video marketing
 • Search engine marketing
 • Display advertising
 • Pay per click advertising
 • Referral Marketing
 • Affiliate marketing
 • Inbound marketing
 • Digital marketing
 • Direct marketing

మరికొంతమంది వ్యాపారస్తులు మధ్యేమార్గంగా offline, online పద్దతులను కలిపి ఉపయోగించుకుంటూ తమ businessని వృద్ధి చేసుకుంటున్నారు. ఏ ఒక్క దానికో పరిమితమై పోకుండా ఈ రెండింటి కలయికను వినియోగించుకోవడమే తెలివైనవారు చేసే పని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *